WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెండుసార్లు లక్షలు వచ్చాయి..మళ్లీ వస్తాయనుకుంటే....!

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు నిరాశ,నిస్పృహలతో డీలా పడిపోయారట. ఈ విధంగా డీలా పడిపోయారని 'జనంప్రత్యేక ప్రతినిధి'ని ఆ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేను స్వయంగా సంప్రదించగా..ఆయన చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటే...తేరగా వస్తే లక్షలైనా దిగమింగేందుకు..సామాన్య ప్రజలే కాదు..స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా దిగజారతారని స్పష్టమైంది. ఆ వివరాలు ఏమిటంటే..ఉప ఎన్నిక సందర్భంగా...శిల్పాచక్రపాణిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయంసాధించారు. అప్పట్లో అధికారపార్టీ స్థానికసంస్థల ప్రతినిధులకు రెండు లక్షల రూపాయల వరకు ఇచ్చారు. కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు పొరుగు పార్టీల వద్ద ఈ విధంగా లక్షలు తీసుకున్నారని బయటకు పొక్కింది. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ముగియటంతో ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 'శిల్పా'నే టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. మూడు వందల మెజార్టీ వస్తుందనుకున్న 'శిల్పా'కు చావు తప్పి కన్నులొట్టపోయినట్లు 50 ఓట్లతో బయటపడ్డారు. 

   మళ్లీ అదే తంతు..రెండు లక్షలు నుంచి ఐదు లక్షలు 'శిల్పా' ఇచ్చారు..ఆయన ప్రత్యర్థి ఇచ్చారు...! ఇరు పార్టీల దగ్గర లక్షలు తీసుకున్న ప్రబుద్దులు మళ్లీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా..? అని ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో 'శిల్పా' మళ్లీ రాజీనామా చేయటం 'గవర్నర్‌' దాన్ని ఆమోదించడం జరిగింది. ఇంకేముంది..తమకు మళ్లీ మూడోసారి కూడా లక్షలు వస్తాయని...ఆశతో ఎదురుచూశారు. రెండుసార్లు సొమ్ములు ఖర్చులు పెట్టిన 'శిల్పా' మళ్లీ పోటీ చేసేందుకు వెనకడుగువేసినా..వైకాపా నుంచి ఏ ఒక్కరూ ముందుకు రాని నేపథ్యంలో తాము పోటీచేయడం లేదని వైకాపా నాయకులు ప్రకటించారు. దీంతో స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా నీరసపడిపోయారు. రాజకీయాలు అటుమారి..ఇటుమారి టిడిపి అభ్యర్థి కె.ఇ. ప్రభాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండుసార్లు లక్షలు వసూళ్లు చేశాం..మూడోసారి మళ్లీ వసూలు చేద్దామనుకున్నాం.. పదవీకాలం ముగిసిపోబోతోంది...మళ్లీ ఎన్నిక అవుతామో..లేదో.. తెలియదు..రిజర్వేషన్లు పద్దతి ప్రకారం మళ్లీ పోటీ చేసే అవకాశం దొరకకపోవచ్చు. దీంతో నూటికి 80శాతం మంది మళ్లీపోటీ చేసే అవకాశం ఉండదు. ఈ విధంగా స్థానిక సంస్థల ప్రతినిధులే లక్షలు కోట్లకు ఆశపడుతుంటే.. అధికారులు..లక్షలు సంపాదించారు...ఉద్యోగులు సొమ్ములు సంపాదించారని విమర్శలు చేయటం పరిశీలిస్తే..అవకాశం వస్తే ప్రతివారూ దోచుకుంటారని వారే రుజువు చేశారు.


(284)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ