WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చిరంజీవి'కి 'పరకాల'...'పవన్‌'కు..'కత్తి'....!

వాళ్లిద్దరూ అన్నదమ్ములు...! వారిలో పెద్దవాడు స్వశక్తితో సినిమా రంగంలోకి పైకివచ్చి మెగాస్టార్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. తరువాత కాలంలో ఒక రాజకీయపార్టీ పెట్టి...ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యారు...! తరువాత..తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి..చేతులు దులుపుకున్నారు. దానిపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి...ఇక రెండోవాడు... తమ్ముడు...'అన్న' బాటలో సినిమాల్లోచేరి ప్రేక్షకులను మెప్పించి...వారిచేత 'పవర్‌స్టార్‌' అనిపించుకున్నారు. సినిమాలు చేస్తూనే...రాజకీయపార్టీ పెట్టి...ప్రజల ముందుకు వస్తున్నాననని ప్రకటించారు....! ఇక ఇక్కట నుంచి మొదలైంది...'తమ్ముడి'కి టార్చర్‌.ఎవరో వ్యక్తి..ఏదో ఛానెల్‌లో కూర్చుని...ఆయన రాజకీయాలకు పనికిరాడు...మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు...! అసలు ఆయనేం చదువుకున్నాడు...! ఆయనకేం అర్హత...ఉంది..ఒకటే రొద...! ఒక ఛానెల్‌ మార్చి...మరో ఛానెల్‌...! ఆ వ్యక్తి ఆగడం ముందు..పాపం..ఆ తమ్ముడికి నోట మాట రావడం లేదు..ఇంతకీ ఎవరా అన్నాదమ్ముల్లంటారా...? తెలుగువారందరికీ తెలిసిన వాళ్లే...'చిరంజీవి, 'పవన్‌కళ్యాణ్‌'లు...!

గతంలో 'చిరంజీవి' 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించి....ఎన్నికల్లో పోటీ చేసే ముందు కూడా 'పరకాల ప్రభాకర్‌' అదే విధంగా ఆయనపై దుమ్మెత్తిపోశారు. మొదట్లో ఆయనతో పెద్ద మేధావని భావించి 'చిరంజీవి' ఆయనను పక్కన పెట్టుకున్నారు. ఎన్నికలకు మరో రెండు, మూడు నెలల సమయం ఉందన్న సమయంలో 'పరకాల' 'చిరంజీవి'పై ధ్వజమెత్తారు...! 'ప్రజారాజ్యం' కార్యాలయంలో కూర్చుని 'చిరంజీవి'ని ఆయన పార్టీని విమర్శించారు. 'ప్రజారాజ్యం' కాదు..దివాలారాజ్యం.. అంటూ..టిక్కెట్లు అమ్ముకున్నారంటూ..ధ్వజమెత్తారు...! ఆయన చేసిన రచ్చ దెబ్బకి 'చిరంజీవి' ఆగమాగమైపోయారు. కేవలం తనకు టిక్కెట్‌ ఇవ్వలేమని అన్నారనే అప్పట్లో 'పరకాల' 'చిరంజీవి'పై చిందులు వేశారని అంటారు. పార్టీలో లోపాలు చెబుతున్నానంటూ...ఆయన 'చిరంజీవి' పతనానికి కారణమయ్యారు. అప్పట్లో 'పరకాల'ను 'చిరంజీవి'పైకి ఎవరో ప్రయోగించారని, అందుకే ఆయన ఆ విధంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించి 'చిరంజీవి'ని చులకనచేశారని రాజకీయవిశ్లేషకులు భావించారు. ఎన్నికలకు ముందే పలువురు నాయకులు 'ప్రజారాజ్యం'పార్టీపై, 'చిరంజీవి'పై ఆరోపణలు చేసి పార్టీ నుంచి నిష్క్రమించినా...వారు చేసిన ఆరోపణలు పెద్దగా ప్రజలకు చేరలేదు. కానీ 'పరకాల' చేసిన విమర్శలు నేరుగా ప్రజల్లోకి చేరాయి. దాంతో..'చిరంజీవి' గెలుపు అవకాశాలు..పూర్తిగా అడుగంటాయి...గతంలో 'చిరంజీవి'పై ఆరోపణలు, విమర్శలు చేసి..ఆయనను 'పరకాల' ఆడిపోసుకోగా...ఇప్పుడు ఆయన 'తమ్ముడు' 'పవన్‌'పై సినీ విమర్శకుడు 'కత్తి మహేష్‌' ధ్వజమెత్తుతున్నారు.

   గత ఐదారు నెలుగా 'కత్తి మహేష్‌' 'పవన్‌'పై విమర్శలు కురిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ షోకు సెలబ్రిటీగా వెళ్లి వచ్చిన తరువాత నుంచి 'కత్తి' 'పవన్‌'పై కత్తికట్టారు. అంతకు ముందు వారి మధ్య విభేదాలు కానీ..మిత్రత్వం కానీ ఉండేది కాదు. కానీ..బిగ్‌బాస్‌ షో తరువాత 'కత్తి' ఒక ఇంటర్వ్యూలో 'పవన్‌'పై విమర్శలు గుప్పించారు. ఇక అక్కడ నుంచి 'పవన్‌' ఫ్యాన్స్‌కు 'కత్తి'కి మధ్య రగడ జరుగుతూనే ఉంది. ఒకవైపు 'కత్తి' 'పవన్‌'పై విమర్శలు గుప్పించడం దానికి ప్రతిగా 'పవన్‌' అభిమానులు 'కత్తి'ని దూషించడం జరుగుతోంది. అయితే..ఇటీవల కాలంలో 'కత్తి' మరింత రెచ్చిపోతున్నారు. 'పవన్‌' ఆయన అభిమానులకు దేవుడేమో..కానీ తనకు కాదని..అటువంటి వాళ్లు..అంటూ బూతు వల్లించారు. దీంతో 'పవన్‌' అభిమానులు మండిపోయారు. ఒక్కసారిగా 'కత్తి' ఫోన్‌నెంబర్‌ సంపాదించిన వారు..ఆయనపై దూషణలకు, బెదిరింపులకు దిగారు. తనకు వస్తోన్న ఫోన్‌కాల్స్‌పై 'కత్తి' టివీ స్టూడియోల్లో కూర్చుని చర్చలు చేస్తూ..మరింతగా 'పవన్‌'పై ధ్వజమెత్తారు. అసలు 'కత్తి' ఎందుకు 'పవన్‌'ను టార్గెట్‌ చేశారు..? ఆయన వెనుక ఉన్నవారెవరు..? 'పవన్‌', చంద్రబాబు,మోడీలపై తాను విమర్శలు చేయగలనని చెప్పుకుంటున్న 'కత్తి'ని ఆడిస్తుందెవరు అన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. 'కత్తి'ని 'జగన్‌' ఆడిస్తున్నారని 'పవన్‌' అభిమానులు విమర్శిస్తుండగా...తాను ఎవరో ఆడమంటే..ఆడేవాడిని కాదని..ప్రశ్నించమన్న 'పవన్‌'ను ప్రశ్నిస్తే తప్పేమిటని..'కత్తి' ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా 'పవన్‌'కు 'కపూర్‌' అనే హీరోయిన్‌తో సంబందం ఉందని 'కత్తి' ఆరోపించారు. దీంతో 'కత్తి', 'పవన్‌'ల మధ్య జరుగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తం మీద...గతంలో 'చిరంజీవి'పై 'పరకాల' ధ్వజమెత్తి...ఆయన రాజకీయ అవకాశాలను దెబ్బకొట్టిన చందంగా నేడు 'పవన్‌'పై 'కత్తి' వ్యవహరించి...ఆయన రాజకీయ అశలకు సమాధి కట్టబోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


(1911)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ