WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సచివాలయ క్యాంటీన్‌లో 'సంక్రాంతి' స్పెషల్‌....!

సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాఖల నందు అచ్చమైన 'తెలుగు వంటకాలను' అందించబోతున్నారు. ఈ మేరకు సచివాలయ క్యాంటీన్‌ నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను, ఆకాంక్షల మేరకు సచివాలయ ఉద్యోగుల కోసం రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేకమైన తెలుగు వంటకాలను 9వ తేదీ నుంచి అందించబోతోంది. 'ఆనంద, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌' లక్ష్యాల్లో భాగంగా ఈ వినూత్న ప్రయత్నాన్ని క్యాంటీన్‌ నిర్వహకులు చేయబోతున్నారు. తెలుగు వంటకాల్లో ప్రత్యేకమైనదైన 'రాగి సంకటి, వేరుశనగ పచ్చడి'ని 9వ తేదీన క్యాంటీన్‌లో అందించబోతున్నారు.10వ తేదీన 'దంపుడు బియ్యం పలావ్‌, కూర్మా'ను, 11వ తేదీన 'మెంతికూర టమాటా అన్నం', 12వ తేదీన 'బెల్లం పొంగల్‌, మసాలా వడ'ను నిర్వాహకులు అందించబోతున్నారు.  సచివాలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ఇతరులు కూడా ఈ ప్రత్యేక వంటకాలను రుచి చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు సచివాలయ క్యాంటీన్‌లో సబ్సీడీ సదుపాయాన్ని కల్పించింది. రోజుకు రెండు సార్లు టిఫిన్లు, ఒకసారి భోజన వసతిని సబ్సీడీ ధరపై అందిస్తున్నారు. రుచికి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ లాభాపేక్ష లేకుండా నిర్వహకులు ఈ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. 'సంక్రాంతి' సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక వంటకాలను తెలుగువారందరూ రుచి చూడాలని క్యాంటీన్‌ నిర్వహకులు కోరుకుంటున్నారు.


(559)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ