WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అభివృద్ధిని అడ్డుకుంటున్న 'అంబటి'ని తరిమికొట్టండి:కోడెల శివరామ్‌

సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటూ, కులపరమైన రాజకీయాలకు పాల్పడుతున్న 'అంబటి రాంబాబు'ను నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ యువనేత 'కోడెల శివరామ్‌' పిలుపునిచ్చారు. ఈ రోజు సత్తెనపల్లిలో 'శివరామ్‌' ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. తాను పుట్టిన ఊరు,నమ్మిన గ్రామస్తులను మోసం చేసి 'సత్తెనపల్లి' వచ్చిన 'అంబటి రాంబాబు'కు ప్రజలు ఒకసారి బుద్దిచెప్పినా..ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ...రాజకీయంగా పబ్బంగడుపుకుంటున్నారు. 'సత్తెనపల్లి'లో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని,ఈ నియోజకవర్గస్తులతో కానీ, ప్రజలతో కానీ 'అంబటి'కి సంబంధం లేదని, అక్కడి ప్రజలు ఛీ కొడితే..ఆయన ఇక్కడు వచ్చారని 'శివరామ్‌' దుయ్యబట్టారు. ఎవరెవరు రాజకీయాల్లో ఏమేమీ చేశారో...ప్రజలకు తెలుసనని, మైకు దొరికింది కదా..అనీ...టీవీల్లో చర్చలకు పిలిచారు కదా..అని ఏది బడితే..అది మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని 'శివరామ్‌' హెచ్చరించారు. ఈ రోజు జరిగిన భారీ బహిరంగ ర్యాలీలో వేలాది మంది స్వచ్చంధంగా పాల్గొనడం విశేషం. తండ్రి కోడెల శివప్రసాద్‌ రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన 'శివరామ్‌'ను ప్రజలు ఆదరణ చూపుతున్నారనడానికి రుజవే ఈరోజు జరిగిన బహిరంగ ర్యాలీ...! అంతకు ముందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..మూడున్నరేళ్లల్లో 'సత్తెనపల్లి' నియోజకవర్గ రూపురేఖలనే మార్చిన ఘనత 'కోడెల శివప్రసాద్‌'కే దక్కిందని చెప్పారు...! అభివృద్ధికి సహకరించాలి..ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎత్తిచూపాలే తప్ప..ఏదో జరగబోతుందని ముందుగానే ఊహించుకుని ఆరోపణలు చేయడం తగదని 'అంబటి'కి 'శివరామ్‌' సలహా ఇచ్చారు. మూడున్నర సంవత్సరాల్లో వెయ్యికోట్ల నిధులతో సత్తెనపల్లి పట్టణంతో పాటు, గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా..మరుగుదొడ్ల నిర్మాణంలో భారతదేశంలో నెంబర్‌వన్‌ నియోజకవర్గానికి పేరు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుమారు 50వేల మంది ప్రజలతో అవయవదానం కోసం స్వచ్చంధంగా ముందుకు వచ్చారని, ఈ విషయాలు తెలిసి కూడా 'అంబటి రాంబాబు' అవాస్తమైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, ఎప్పుడో ఒకప్పుడు కడుపు మండిన ప్రజలు ఆయనను ఈ నియోజకవర్గం నుంచి తరిమికొట్టడమే కాకుండా..మళ్లీ ఈ ప్రాంతానికి రాకుండా..తగు రీతిన బుద్దిచెబుతారని 'కోడెల శివరామ్‌' హెచ్చరించారు. https://www.facebook.com/davuluri.hanumantharao/videos/1498705863559317/




(261)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ