WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సోషల్‌మీడియాలో 'సర్వే'ల దుష్రృచారాలు...!

నిన్నటి మొన్నటివరకు సోషల్‌మీడియాలో రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రులు ఎవరు అనే విషయంపై చాలా మంది మౌనం వహించగా..తాజాగా మరికొందరు తెరపైకి వస్తున్నారు. అదుగో..సర్వే జరిగింది..ఇదిగో సర్వే జరిగింది...అన్నిసర్వేల్లో..'జగన్‌' పార్టీకి 80అసెంబ్లీ సీట్లు..టిడిపికి 40 మిగతా సీట్లల్లో ఉత్కంఠపోటీ నెలకొందని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా..టివి9 సర్వే, లగడపాటి సర్వే...కేంద్ర నిఘా సంస్థల సర్వేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన సర్వేల్లో కూడా 'జగన్‌' పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడైందని గత రెండు రోజుల నుంచి ప్రచారహోరు,జోరు అమాంతంగా పెరిగింది. దీని వెనుక 'జగన్‌' సలహాదారు 'ప్రశాంత్‌కిశోర్‌' టీమ్‌ హస్తం ఉందని, వారు ఒక పథకం ప్రకారం మళ్లీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారని నిఘా వర్గాలు పసికట్టాయి. జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై సోషల్‌మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే నియోజకవర్గాల్లో ఉత్కంఠ పోరు జరగనుందని, అసత్యకథనాలు ప్రచురిస్తున్నారు. వాస్తవానికి టివి9 యాజమాన్యం కానీ, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌లు ఎటువంటి సర్వేలు నిర్వహించలేదని, దుష్రృచారం చేస్తున్నవారికి, వారి వెనుక ఉండి గొడవ చేస్తున్నవారికి తెలుసు. ఈ మధ్యకాలంలో తాను ఎటువంటి సర్వేలు చేయించలేదని 'లగడపాటి' బహిరంగంగానే వెల్లడించారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. 

  సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్రృచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ మీడియా సలహాదారు 'పరకాల ప్రభాకర్‌' కానీ, సిఎం కార్యాలయంలో ప్రత్యేకంగా నియమింపబడ్డ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జీతభత్యాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నా..సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఘోరంగా విఫలమయ్యారనేది వాస్తవం. ఈ విషయంపై సిఎంఒ అధికారిని ఒక మీడియా ప్రతినిధి కలసి వివరణ కోరగా సోషల్‌మీడియాలో దుష్రృచారం జరుగుతున్న మాట యధార్థమేనని, ఆ దుష్రృచారాన్ని తిప్పికొట్టడంలో అటు 'పరకాల' సిబ్బందికానీ, ఇటు ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బంది కానీ ఘోరంగా విఫలమయ్యారని అంగీకరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచి ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బందిని తప్పించి..సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్రృచారాన్ని తిప్పికొట్టి ఎదురుదాడి చేయాలని లేకుంటే తటస్థ ఓటర్లు ఈ ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.





(97)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ