WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' పాదయాత్రలో కనిపిస్తున్న వారు...వైకాపా ఓటర్లే...!

ఒకపక్క 'జగన్‌' ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతోంది. ఆయనను చూసేందుకు..మాట్లాడేందుకు వేలాది మంది ప్రజలు వస్తున్నది యధార్థమే. కానీ వచ్చిన వారందరూ ఆయన ఓటర్లా లేక..వారు ఏదో వచ్చారు..చూస్తున్నారూ..వెళ్లిపోతున్నారా..? లేక వై.ఎస్‌. కుటుంబ అభిమానులా..? అనే విషయంపై 'జగన్‌' అనుసరిస్తున్న పికె టీం సర్వే చేయించిందట. పార్టీ ప్రచారవ్యూహకర్త..ప్రశాంత్‌ కిశోర్‌ దీనిపై తెలుగు,ఇంగ్లీషుల్లో వచ్చిన వారిని తన టీంకు అనుసంధానంగా నియమించారట. 'జగన్‌' పాదయాత్రను అనుసరిస్తున్న వారిని వారితో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది...మీ ఊరిలో ఏపార్టీకి ఓటర్లు మొగ్గుచూపుతున్నారు.. ప్రభుత్వ సంక్షేమపథకాలు అందుతున్నాయా..? లేదా..? ఆయా పథకాలు వివక్ష లేకుండా అందుతున్నాయా..?లేదా..అని ప్రశ్నిస్తున్నారట..? అసలు విషయమేమిటంటే 'జగన్‌' పాదయాత్రకు వస్తున్నవారిలో నూటికి 90శాతం 2014లో వైకాపాకు ఓటు వేసిన వారే...! అప్పట్లో అన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులకు 45 నుంచి 50వేల ఓట్లు పోలైన విషయం విదితమే. 'జగన్‌'ను చూసేందుకు టిడిపి ఓటర్లు అసలు రావడం లేదని, తటస్థ ఓటర్లలో కనీసం 25శాతం కూడా రావడం లేదని ప్రశాంత్‌ టీం తేల్చిందట. ఏయే గ్రామాల్లో ఏ పార్టీ పరిస్థితి బాగుంది..అన్న వివరాలను తెలుసుకుంటూ రాసుకుంటున్నారు. 

   ఇప్పటి వరకు ఆ టీంకు అందిన సమాచారం మేరకు పాదయాత్రకు వస్తున్నవారిలో ఎక్కువ మంది గతంలో వైకాపాకు ఓటువేసిన వారేనని, మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా...వారిలో ఎక్కువ మంది ఆ పార్టీకే ఓటు వేస్తారని పికె టీం తెలుసుకుంది. ముఖ్యంగా పలుప్రాంతాల్లో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తుందా..? లేదా..పాలకులపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా..? అనే విషయంపై ఈ టీం పలువురిని ప్రశ్నించగా ప్రతి గ్రామంలో చాలా మందికి వెయ్యి రూపాయల ఫించన్లు ఇస్తున్నారని, కొత్తగా ఇస్తున్న ఫించన్లలో టిడిపి సానుభూతిపరులకే ఎక్కువగా ఇస్తున్నారని, గతంలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు ఇస్తున్నారని, ఇప్పుడు టిడిపి వారికి ఇస్తున్నారని పికె టీంకు చెబుతున్నారు. దీనిని బట్టి పాదయాత్రలో పార్టీ సానుభూతిపరులే వస్తున్నారే తప్ప..అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం లేకపోవడంతో మళ్లీ సోషల్‌మీడియాలో 'జగన్‌' అనుకూల ప్రచారాన్ని..'బాబు'వ్యతిరేక ప్రచారాన్ని పికె టీం ప్రారంభించింది. ఇప్పటి వరకు వారు నిర్వహించిన సర్వేలో వైకాపా కంచుకోటలో ప్రజలు ఒక విధంగా..టిడిపి కంచుకోటలో ప్రజలు మరో విధంగా..తటస్థ ఓటర్లుల్లో ఎక్కువ మంది చంద్రబాబువైపు మొగ్గుచూపుతున్నట్లు ఆ టీం తెలుసుకుంది. ఈ విధమైన స్పష్టత బయటపడడంతో..ఏదైనా కొత్త ఎత్తుగడతో ముందుకు రావాలని ఆ పార్టీ వ్యూహకర్త ఆలోచిస్తున్నట్లు టీం సభ్యులు చెబుతున్నారు.


(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ