WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు...!?

ప్రస్తుతం హస్తినాపురంలో జరుగుతున్న హడావుడి చూస్తుంటే...'మోడీ' ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  వాస్తవానికి మార్చి,ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే..ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి..ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా' నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారు దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, అయితే...ఎన్నికలు ఎప్పుడు జరగాలనేదానిపైనే ఇంకా తుది నిర్ణయానికి రాలేదట. దేశ వ్యాప్తంగా 'మోడీ'కి వ్యతిరేకగాలి ఆరంభమైందని, దాన్ని తట్టుకోవాలంటే...ముందస్తు ఎన్నికలే మార్గమని వారు భావిస్తున్నారు. బిజెపి నేతల నిర్ణయానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కారణమట. ఇప్పటికే 'మోడీ' ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత, అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుందని, దీన్ని ఎదుర్కోవాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమని వారు అంచనా వేస్తున్నారట. 

  సార్వత్రిక ఎన్నికలు సాధారణ షెడ్యూల్‌లో జరగడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగే వరకు ఆగితో ప్రజల్లో 'మోడీ' ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత, అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికీ 'మోడీ' ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని నమ్మేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని, మరో ఏడాది గడిస్తే..వీరిలో కూడా అదే అసంతృప్తి రాజ్యమేలుతుందని, అప్పుడు పూర్తిగా మునిగిపోతామని, ముందస్తుకు వెళితే..కనీస మెజార్టీ తెచ్చుకోవడానికైనా అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారట. వీటితో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారట. దాదాపు 8 రాష్ట్రాలకు నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ మాసంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి ఆరు నెలల ముందు..కానీ..తరువాత కానీ జరిపించడానికి ఎన్నికల కమీషన్‌కు అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమీషన్‌ ఆయా రాష్ట్రాల్లోనూ ఎన్నికలను నిర్వహిస్తుంది. మొత్తం మీద 'మోడీ' తదితరులు ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే..డిసెంబర్‌ మాసంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది.

(648)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ