WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సంక్రాంతి'కి సిద్ధమైన విజయవాడ ఆర్టీసీ...!

సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా విజయవాడ నుండి వివిధ ప్రాంతాలకు 830 బస్సులను ఏర్పాటు చేసేందుకు కృష్ణా జిల్లా రీజినల్‌ మేనేజర్‌ రామారావు రంగం సిద్దం చేశారు. 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు హైదరాబాద్‌కు 600 బస్సులు,చెన్నైకు 105 బస్సులను, బెంగుళూరుకు 35 బస్సులను, విశాఖపట్నంకు 85 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నుండి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారయంత్రాగం అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగినా..బస్సు టిక్కెట్ల కొనుగోలులో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే...కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారమే ఆయా బస్సుల టిక్కెట్ల రేట్లు ఉన్నాయని, అన్ని వివరాలను విజయవాడ బస్‌స్టాంట్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా శనివారం నుండి 17వ తేదీ బుధవారం వరకు 400 బస్సులను హైదరాబాద్‌కు ఏర్పాటు చేశారంటే..ప్రయాణీకుల రద్దీ ఏ విధంగా ఉంటుందో ముందుగానే అంచనా వేశారు. అదే విధంగా చెన్నైకు 60, బెంగుళూరుకు 20 బస్సులకు విశాఖపట్నం 85 బస్సులు ఆయా రోజుల్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధమైన ఏర్పాట్లు గతంలో చేసినా..అప్పట్లో ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా, విమర్శలు, ఆర్ఱోపణలు రాకుండా...ప్రయాణీకుల అభిమానాన్ని పొందేందుకు సంబంధిత అధికారులకు బాధ్యతలను ఆర్‌ఎం రామారావు అప్పగించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన అధికార యంత్రాంగంతో పలు సమావేశాలను నిర్వహించారు. ఎవరు ఏ విధమైన బాధ్యతలను నిర్వహించాలో సూచించారు. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందరూ కలసికట్టుగా పనిచేసి విజయవాడ రీజియన్‌ను ఉత్తమ రీజియన్‌ పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన అధికారులను, సిబ్బందిని కోరారు. ఈ విధంగా ప్రయాణీకులకు ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎం రామారావు తీసుకున్న శ్రద్ద ఇంతకు ముందు ఎవరూ తీసుకోలేదని క్రింది స్థాయి సిబ్బంది, ఉద్యోగులు మీడియా వర్గాలకు తెలిపాయి.


(191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ