WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీమలో టిడిపికి 43 సీట్లు వస్తాయట...!

'అనంతపురం' పార్లమెంట్‌ సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి ఏదీ మనస్సులో ఉంచుకోరు. ఎవరు ఏమనుకున్నా...ఆయన పట్టించుకోరు..! తన మనస్సులో ఉన్న మాటను ఆయన బయటకు కక్కేస్తారు...! అది స్వంత విషయమైనా..పార్టీ విషయమైనా..ప్రతిపక్షానికి సంబంధించిన విషయమైనా...! తాజాగా ఆయన రాయలసీమ రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. 'రాయలసీమ'లో వై.ఎస్‌.జగన్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఆపార్టీ బాగా బలహీనపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...సీమలో తెలుగుదేశం పార్టీ 43 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..టిడిపికి తాను చెప్పిన దానికంటే ఒకటి రెండు ఎక్కువే వస్తాయని 'దివాకర్‌రెడ్డి' బల్లగుద్ది చెపుతున్నారు. 

   'రెడ్డి' సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోనే 'వైకాపా' బలహీనపడిందని...ఇక్కడ పరిస్థితితో పోల్చుకుంటే...ఆంధ్రాలో టిడిపి స్వీప్‌ చేస్తుందని ఆయన అన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన 'టిడిపి' ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, కొంత మంది కులమేదేతై తమకెందుకు..తమ కష్టాలు తీర్చిన 'చంద్రబాబు'కే ఓటు వేస్తామని చెబుతున్నారని...దీనిలో తమ సామాజికవర్గం వారు కూడా ఉన్నారని ఆయన చెబుతున్నారు. మొత్తం 52 సీట్లు ఉన్న 'రాయలసీమ'లో టిడిపికి 43 సీట్లు గెలిస్తే..వైకాపాకు దక్కేది కేవలం 9 సీట్లు మాత్రమే...! ఒకవైపు 'జగన్‌' అష్టకష్టాలు, ఆయాసపడుతూ పాదయాత్ర చేస్తున్నా ఆ పార్టీ పుంజుకోకపోవడంపై పార్టీకి చెందిన సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా...'జెసిదివాకర్‌రెడ్డి' చేసిన వ్యాఖ్యలు 'సీమ'లో సంచలనం సృష్టిస్తున్నాయి.


(6157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ