WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాడు..బొబ్బిలిపులి...నేడు 'అజ్ఞాతవాసి'...!

1982లో విడుదలైన 'బొబ్బిలిపులి' సినిమా టిక్కెట్‌ రేటు నాలుగు లేక ఐదు రూపాయలు ఉండగా...అప్పట్లోనే బ్లాక్‌లో రూ.50/- రూ.100/-లకు అమ్మి సంచలనం సృష్టించగా..తాజాగా 'పవన్‌కళ్యాణ్‌' సినిమా 'అజ్ఞాతవాసి' టిక్కెట్‌ధర రూ.700/- నుండి రూ.1000/- పలికింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర,ఉభయగోదావరి జిల్లాల్లో అభిమానులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. టిక్కెట్ల అమ్మకంలో ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో ప్రారంభ టిక్కెట్‌ ధర రూ.700/- నుంచి రూ.1000/-కు అమ్ముకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా సొమ్ములు ఖర్చుపెట్టి టిక్కెట్లు కొనుగోలు చేసిన ఖ్యాతి దివంగత ఎన్టీఆర్‌కు దక్కగా..మళ్లీ ఆ ఖ్యాతిని ఇంతకు ముందు ఎవరూ పొందలేకపోయారు. తాజాగా 'పవర్‌స్టార్‌' 'పవన్‌కళ్యాణ్‌' ఆ ఖ్యాతిని దక్కించుకుని సంచలనం సృష్టించారు. తాజాగా దీనిపై కొందరు పోలీసు అధికారులు బాహాటంగానే స్పందిస్తూ...ఆన్‌లైన్‌ విధానంలో టిక్కెట్లు అమ్మకపోవడమే దీనికి కారణమని, ప్రభుత్వం బెనిఫిట్‌షోలకు అనుమతి ఇచ్చినా..టిక్కెట్లు అమ్మకాలపై విదివిధానాలను రూపొందించకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఏది ఏమైనా..అప్పటి సినీస్టార్‌ల్లో ఎన్టీఆర్‌...ఇప్పటి స్టార్‌లల్లో 'పవన్‌కళ్యాణ్‌'లను బీట్‌ చేయలేరని చెప్పవచ్చు. రాజ్యసభ సభ్యుడు 'చిరంజీవి' కూడా 'పవన్‌' టిక్కెట్‌లు ఉన్న డిమాండ్‌ను సాధించలేకపోయారు. మిగతా హీరోలకన్నా..అగ్రహీరోగా ఎదిగారనే తప్ప...ఆయనసోదరుడు 'పవన్‌'కు ఉన్న డిమాండ్‌ స్థాయిలో ఆయన ఎదగలేకపోయారు. 'పవన్‌కళ్యాణ్‌' ఈ స్థాయికి ఎదగడంతో...చిరంజీవి ఆనందత్సోవాలతో ఉన్నారట. ఏది ఏమైనా అభిమానులు కూడా రూ.700/- నుండి రూ.1000/-లతో టిక్కెట్లు కొని సినిమా చూస్తున్నారంటే...పవన్‌పై వారికి ఎంత అభిమానం ఉందో స్పష్టం అవుతుంది.


(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ