WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రావంటకాలు' శభాష్‌...'రాగిసంకటి' భేష్‌:మీనా

సచివాలయంలోని ఉద్యోగుల సహకారసంఘ క్యాంటీన్‌లో ఆంధ్రా వంటకాల రుచి బాగుందని, తెలుగు వంటకాల రుచి అందరికీ చూపిస్తున్నారని..'జన్మభూమి..మావూరు' కార్యక్రమం సందర్భంగా ప్రతి జిల్లా మండలాల్లో...ఆంధ్రా వంటకాల పండుగను నిర్వహించి ప్రజలకు తెలుగు వంటకాల రుచిని చూపిస్తున్నామని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. మంగళవారం నాడు సచివాలయ క్యాంటీన్‌లో ఆయన వంటకాల రుచిని చూసి అభినందించారు. ఆయనతోపాటు సచివాలయ సంఘ అధ్యక్షుడు మురళీకృష్ణ, క్యాంటీన్‌ అధ్యక్షుడు వంకాయల శ్రీనివాస్‌లు ఉన్నారు. మంగళవారం నాడు రాగిసంకటి, వేరుశెనగ పచ్చడి బాగుందని నిర్వహకులను 'మీనా' అభినందించారు. 'రాగిసంకటి' ఆరోగ్యకరమైన ఆహారమని, ఉద్యోగులు, సందర్శకులు 'రాగిసంకటి' రుచి చూడాలని ఆసంఘ అధ్యక్షుడు శ్రీనివాస్‌ కోరారు. క్యాంటీన్‌లో సాధారణ భోజనంతో పాటు...నాలుగు రోజుల పాటు అదనంగా ప్రత్యేకంగా తెలుగు వంటకాలను వడ్డిస్తామని మీడియా వర్గాలకు శ్రీనివాస్‌ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ సచివాలయ క్యాంటీన్‌లో ఆంధ్రా వంటకాలకు అటు ఉద్యోగుల నుండి..ఇటు సందర్శకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం కూడా మరిన్ని ఆంధ్రా వంటకాలను రుచి చూపించబోతున్నామని ఈ అవకాశాన్ని అన్ని వర్గాల వారు ఉపయోగించుకోవాలని సంఘం అధ్యక్షుడు 'శ్రీనివాస్‌' కోరారు.


(249)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ