WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎంవో నుంచి 'రాజమౌళి' అవుట్‌...రాజశేఖర్‌ ఇన్‌...!

ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి 'రాజమౌళి' డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ సర్వీసుకు రావడం..ఆయనను తన కార్యాలయంలో నియమించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 'రాజమౌళి' నిజాయితీగా, సమర్థవంతగా, విమర్శలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించి, రాజకీయ, అధికార వర్గాల మన్నలను పొందారు. ఇంతకు ముందు రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారపార్టీ నాయకులు, పలుశాఖాధిపతులు, డైరెక్టరేట్‌లకు చెందిన అధికారులు ఇతరులు ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆ విధంగా పేరు తెచ్చుకున్న 'రాజమౌళి' ఎటువంటి బలహీనతలకు లోనయ్యారో..కానీ..ఇటీవల కాలంలో ఆయన అంతరంగికులు ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారని ప్రచారం జరిగింది. మొదట్లో దీనిపై దృష్టిసారించని ముఖ్యమంత్రి చంద్రబాబు...ఆ తరువాత...ఆయనతో సన్నిహితంగా మెలిగే ఒక అధికారి ద్వారా...'రాజమౌళి' పనితీరును తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎటువంటి అధికారి..ఎటువంటి పేరు తెచ్చుకున్నారో..ప్రస్తుతం ఆయనపై ఎందుకు ఈ విధంగా ప్రచారం జరుగుతుందని..ఆరా తీయగా...ఆయన అంతరంగికులపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు చాలా వరకు నిజమేనని 'చంద్రబాబు' తెలుసుకున్నారు. గతంలో సిఎం కార్యాలయంలో 'రాజమౌళి' వ్యవహారశైలిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనాలపై సిఎంఒలో పనిచేస్తోన్న ఇతర అధికారులతో పాటు..పలువురుశాఖాధిపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ ప్రముఖులు తప్పుట్టారు. ఎవరైతే..ఆ విధంగా తప్పుపట్టారో...వారిలో చాలా మంది 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనాలు నిజమేనని అంగీకరిస్తున్నారు. 'రాజమౌళి' అంతరంగికుల గురించి వారికి ఏమి తెలిసిందో... బయటకు పొక్కకపోయినా...ఇటీవల కాలంలో 'రాజమౌళి' వ్యవహారం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. 

  ఇది ఇలా ఉండగా..పౌరసరఫరాలశాఖ కమీషనర్‌ వ్యవసాయ, మార్కెటింగ్‌ మరియు సహకారశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'రాజశేఖర్‌'ను సిఎంఒలో నియమించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యధార్థం ఉందో లేదో...కానీ..గత పదిరోజుల నుండి 'రాజశేఖర్‌' సిఎంఒలోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 'రాజశేఖర్‌' నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారిగా పేరుంది. ఆయన పనితీరుపై సిఎం పలుసార్లు బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. ఆయనకు కులాభిమానం కొంత ఉందని విమర్శ తప్ప..మిగతా విషయాల్లో ఎటువంటి విమర్శలు, ఆరోపణలు లేవన్నది యధార్థం. ఇటీవల సీనియర్‌ అధికారుల వద్ద 'రాజశేఖర్‌' వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు అదే అభిప్రాయాన్ని వారందరూ ముక్తకంఠంతో వ్యక్తం చేశారు. సిఎంఒలో మార్పులు చేర్పులు ఎప్పుడు జరగనున్నాయనే విషయం అతి త్వరలో తెలియనుంది. కానీ సిఎంఒకు రాజశేఖర్‌ను తీసుకునే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ..అప్పట్లో..రాజమౌళిపై ఎటువంటి విమర్శలు..వ్యతిరేకత బయటపడలేదు. తాజాగా సిఎంఒలో 'రాజశేఖర్‌'ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తుండడంతో ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని పక్కనపెట్టాలనే దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'రాజమౌళి'ని సిఎంఒ నుంచి తప్పిస్తారని జరుగుతున ప్రచారంలో ఎంత వరకు వాస్తవం ఉందో కానీ..అధికారవర్గాలు ఈ విషయంలో బాహాటంగా స్పందించకపోయినా..ఆఫ్‌ ది రికార్డుగా ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నాయని తమకు కూడా సమాచారం ఉందని అంటున్నారు.

(421)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ