WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'మాణిక్యాలరావు'కు ఉద్వాసన ఖాయం...!

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా...మిత్రపక్షానికి చెందిన దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును పదవి నుంచి తప్పించి ఆ కోటాలో మరొకరి ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మాణిక్యాలరావు చేసిన విమర్శలు, ఆరోపణలు, ఆవేశ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. నన్ను కట్‌ చేస్తే..రాష్ట్రాన్ని కట్‌ చేస్తాను..అనడంలో అర్థం, పరమార్థం ఏమిటి..? బిజెపి,టిడిపి పొత్తును కట్‌ చేస్తారా..? లేదా ప్రభుత్వాన్ని ఏదో విధంగా కూల్చివేస్తారా..? మంత్రిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినా...అక్రమాలకు పాల్పడినట్లు రుజువులు ఉన్నా..ముఖ్యమంత్రి ఏనాడూ పిలిచి మందలించడం కానీ, పనితీరు మార్చుకోవాలని సూచించడం కానీ చేయలేదు. పెద్ద దేవాలయాలకు ఇఒలు నియమించే ముందు సహచర మంత్రుల సిఫార్సులను ఖాతరు చేయకుండా, దగ్గర బంధువు సిఫార్సుతోనే సంతకం చేసేవారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గతంలోనే ప్రచురించింది. మంత్రి మాణిక్యాలరావు వ్యవహారశైలి ముఖ్యమంత్రికి తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. వదిలేయడమే...ఆయనకు వరమైంది. తాడేపల్లి గూడెంలో జరుగుతున్న విభేదాలకు రాష్ట్రంపై విమర్శలు చేయడం ఏమిటి..? తాడేపల్లిగూడెంలో వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని మంత్రి మాణిక్యాలరావును గెలిపించి మంత్రి పదవి ఇప్పించినా..సంతృప్తి చెందక విమర్శలు చేయటం ఏమిటని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బడ్జెట్‌ సమావేశాల తరువాత మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు.


(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ