WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫించన్లు,రేషన్లల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతా:కలెక్టర్‌ భాస్కర్‌

'జన్మభూమి'లో అర్హులందరికీ సంక్షేమపథకాలు అమలు చేస్తున్నామని సంవత్సరంలోపు నూటికి నూరుశాతం సిమెంట్‌రోడ్లు గ్రామాల్లో నిర్మిస్తామని, ఇతర మౌళిక వసతులు కూడా కల్పిస్తామని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. బీదవర్గాలకు అందించే ఫించన్లు కాజేసే అధికార్లను సస్పెండ్‌ చేస్తామన్నారు. రేషన్‌ బియ్యాన్ని దిగమింగితే డీలర్లను జైలుకు పంపుతామన్నారు. అన్ని గ్రామ పంచాయితీల్లో ఇ-పంచాయితీని ఏర్పాటు చేశామని, అక్కడే గ్రామానికి సంబంధించిన పన్నులు చెల్లించే అవకాశాన్ని కల్పించామన్నారు. జిల్లాలో ప్రప్రథమంగా ఆలం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించడం అభినందనీయమని భాస్కర్‌ అన్నారు. జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోర్టు తీర్పు మేరకు కోడి పందాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 144 సెక్షన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుండి అందిన ధరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని, ఇందులో ఎటువంటి వివాదాలు ఉండవని నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఏమి అందాలో అవి అందజేస్తామని 'భాస్కర్‌' తెలిపారు. పదిరోజుల 'జన్మభూమి' కార్యక్రమంలో అధికారులందరూ మనస్ఫూర్తిగా పాల్గొన్నారని వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ