WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గ్రామీణాభివృద్ధిశాఖను పరిగెత్తిస్తున్న 'లోకేష్‌'...!

గతంలో గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి..అప్పటి వరకు చతికిలపడి ఉన్న ఆ శాఖను దుమ్ముదులిపి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి, నరేగా పథకం కింద పనులు సకాలంలో పూర్తికావడం, కేంద్రం నుంచి సకాలంలో నిధులను విడుదల చేయించుకోవడంలో ఆశాఖకు వన్నెతెచ్చారు..ప్రస్తుత ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌'. అప్పట్లో ఆ శాఖకుమంత్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఆశాఖాధిపతిగా కిందిస్థాయి కమీషనర్‌ నుంచి పలు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో పనిచేయించిన ఘనత 'దినేష్‌కుమార్‌'కే దక్కింది. తరువాత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్‌ తనదైన శైలిలో తన సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ నిధులను సకాలంలో విడుదల చేయించుకోవడం సఫలీకృతులయ్యారు. ఇటీవలే..సుమారు రూ.1350కోట్లు నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. త్వరలో మరో రూ.1200కోట్లు విడుదల కానున్నాయి. నరేగా పథకం ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఢిల్లీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ నిధులు విడుదల చేయించుకుంటున్నారు 'లోకేష్‌'. ఆ శాఖాదిపతి 'జవహర్‌రెడ్డి' మొక్కుబడిగా వ్యవహరిస్తున్నా... కేంద్ర అధికారులతో సకాలంలో చర్చించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిసినా..ఏ కారణాలతో ఆయనను 'లోకేష్‌' భరిస్తున్నారో..? ఎందుకు ఆయనను ఆశాఖాధిపతిగా కొనసాగిస్తున్నారో..? ఆశాఖలో పనిచేస్తున్న అధికారులకు అంతుబట్టడం లేదు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించడంలో మంత్రి లోకేష్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనలు, సలహాలు తీసుకుంటూ..ఆయన ద్వారా కేంద్ర అధికారులతో మాట్లాడిస్తూ..ఆ శాఖ కమీషనర్‌ను ఢిల్లీలో అధికారులు కలసి చర్చించి ఎప్పటికప్పుడు నిధులు ఎలా విడుదల చేయించుకోవాలో సూచిస్తున్నారు. నిన్నటి వరకు ఎటువంటి అధికార అనుభవం లేని మంత్రి లోకేష్‌ ఈ ఆరు నెలల్లో రాట్‌ తేలిపోయారని, ఎవరెవరితో ఎలా మాట్లాడాలో..ఎవరెవరి సహాయసహకారాలు తీసుకోవాలో..ఆ విధంగా తీసుకుంటూ...గ్రామీణాభివృద్ధిశాఖను అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారని, ఈ విషయంలో ఎటువంటి విమర్శలు, ఆరోపణలకు, జాప్యానికి తావివ్వకుండా, పనులు ఆలస్యం కాకుండా చేయాలని కమీషనర్‌ రామాంజనేయులు శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖను ఈ విధంగా పరుగులెత్తించిన ఘనత 'లోకేష్‌'కే దక్కిందని, తక్కువ కాలంలో ఎక్కువ అనుభవం మంత్రిగా ఆయన పనిచేస్తున్నవిధానం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆ శాఖ కమీషనర్‌ 'రామాంజనేయులు' కిందిస్థాయి అధికారులకు తెలిపారు. ఇంతకు ముందు వైకాపా ఎంపీలతోపాటు, రాష్ట్రంలోని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి తప్పుడు ఆధారాలతోఫిర్యాదు చేసి నిధులు విడుదల కాకుండా అడ్డుపడ్డారనే విమర్శలు వచ్చాయి. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన అధికారులు...'నరేగా' పనులను అనేక జిల్లాల్లో పరిశీలించి..ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పనులు సరిగా జరిగాయని కితాబు ఇచ్చారు. 

  కేంద్రశాఖాధిపతి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తూ..ముఖ్య అధికారులకు లిఖిత పూర్వకంగా కొనియాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భవిష్యత్‌లో గ్రామీణాభివృద్ధిశాఖకు ఈ సంవత్సరం విడుదలైన నిధుల కంటే రెట్టింపు నిధులు కేంద్రం నుంచి విడుదలవుతాయని, ఈ విషయంలో జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు అందరూ ఎక్కడికప్పుడు అన్ని ప్రాంతాలు పర్యటించి 'నరేగా' పనులపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర నివేదిక అందించాలని, ఆ నివేదికను మంత్రి లోకేష్‌ చూసి అందరినీ అభినందించాలని శాఖ కమీషనర్‌ రామాంజనేయులు ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులను కోరడం జరిగింది. ఏది ఏమైనా 'నరేగా' పనులు సకాలంలో పూర్తి చేయటంలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన అధికారులతో పాటు, కేంద్రం నుంచి నిధులను సకాలంలో విడుదల చేయించుకోవడంలో మంత్రి నారా లోకేష్‌ కొత్త ఒరవడిని సృష్టించారని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు అధికారులే..ఈ నరేగా పథకంపై ప్రత్యేకదృష్టిసారించారు..అప్పటి మంత్రులు కూడా...సరిగా పట్టించుకోలేదు. ప్రస్తుతం శాఖ మంత్రి లోకేష్‌ ప్రత్యేక దృష్టిసారిస్తూ..గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ..'నరేగా' పనులుసకాలంలో పూర్తి చేయిస్తూ...కేంద్ర నిధులను సకాలంలో విడుదల చేయించడంలో తన చాకచక్యాన్ని చూపిస్తూ అందరి అభిమానాన్ని చూపిస్తున్నారు.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ