WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కెసిఆర్‌ అవినీతిలో గవర్నర్‌కు భాగం:విహెచ్‌...!

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నర్సింహ్మన్‌ కెసిఆర్‌ అవినీతిలో భాగస్తుడని అందుకే ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని, త్వరలో గవర్నర్‌పై కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని, అవసరమైతే...గవర్నర్‌కు సీబీఐ వారెంట్‌ జారీ చేయిస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కెసిఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడమేమిటని, కెసిఆర్‌ పేరును, హరీష్‌రావును మార్చుకోవాలని చెప్పడం ఏమిటి..? ఇంతకు ముందు ఈ విధంగా ఏ గవర్నర్‌ ఈ విధంగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థను ఆయన దిగజార్చుతున్నారని, త్వరలో ప్రధాని మోడీకి గవర్నర్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని 'విహెచ్‌' చెప్పారు. తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిన విషయంపై తాము గతంలో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, గవర్నర్‌ కెసిఆర్‌ను, హరీష్‌రావును పదే పదే పొగడడం వెనుక వారి అవినీతిలో గవర్నర్‌కు భాగస్వామ్యం ఉందన్న అనుమానాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ కెసిఆర్‌ ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తున్న గవర్నర్‌ నర్సింహ్మన్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకులు ఆయనను ఎండగట్టుతున్నారు. విహెచ్‌ చేసిన విమర్శలు, ఆరోపణలపై గవర్నర్‌ నర్సింహ్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..న్యాయపరంగా, చట్టపరంగా, ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో..అనే విషయంపై ఆయన అంతరంగిక అధికారులు, సీనియర్‌ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా గవర్నర్‌పై ఇటువంటి ఆరోపణలు రావడంపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.

(218)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ