ఆళ్ళగడ్డకు 50 కోట్లు కేంద్రం నిధులు మంజూరు 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆళ్ళగడ్డకు 50 కోట్లు కేంద్రం నిధులు మంజూరు

ఆళ్లగడ్డ,జనవరి 23 (జనం ప్రతినిధి) ఆళ్లగడ్డ నియోజక వర్గం యం ఎల్ ఏ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ రాబోయే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించటం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అందులో భాగంగానే నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేంద్రం నుండి 50 కోట్లు నిధులు వెంకయ్యనాయుడుతో చర్చించి తీసుకుని వచ్చినట్లు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి.వి.రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్ళగడ్డ నుండి అహోబిలం రోడ్డు విస్తరణకు13కోట్లు, చాగలమర్రి నుండి నరసాపురం నంద్యాల రోడ్డుకు 30 కోట్లు, ముకుందాపురం కె.సి.కాలువకు 1.50 కోట్లు, దొర్నిపాడు నుండి కంపమల్ల రోడ్డుకు 5 కోట్లు మంజూరయ్యాయన్నారు. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వరకు కూడా నిధులు త్వరలో తీసుకొస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం ప్రజలకు మరిన్ని సేవలు చేస్తున్నామన్నారు.

(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ