లేటెస్ట్

టిడిపి నుంచి పోటీ చేస్తా:కోటంరెడ్డి

వచ్చే ఎన్నికల్లో తాను టిడిపి నుంచి పోటీ చేస్తానని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తేల్చి చెప్పారు. తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని, తను తన ఫ్రెండ్స్‌తో మాట్లాడిన విషయాలకు బయటకు వచ్చాయని, తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురువుతుందని ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తనతో చెప్పారని, దానికి సంబంధించిన ఆడియో కూడా తనకు పంపారని, ఫోన్‌ ట్యాపింగ్‌కు ఇంతకన్నా రుజువులు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. తన ఒక్కడి ఫోన్‌ మాత్రమే ట్యాపింగ్‌కు గురి కాలేదని, తనతో పాటు మంత్రులు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన నాయకుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేశారని ఆయన ఆరోపించారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు నెంబర్‌ను ఆయన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేశారని, ఫోన్‌ ట్యాపింగ్‌పై తాను ఎంత దూరమైనా వెళతానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేస్తానని, చంద్రబాబు ఇష్ట ప్రకారం తాను వ్యవహరించుకుంటానని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేస్తే ఆయనకు ఎలా ఉంటుందోనని, తనకు అవమానం జరిగిన చోట తాను ఉండనని, బాలినేని మాటలను సిఎం మాటలుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. మొత్తం మీద గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ