WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ 'టిడిపి'దే అధికారమట...!?

టిడిపికి 139, వైకాపాకు 28 జనసేనకు9 స్థానాలు వస్తాయట....

58శాతం ఓట్లు టిడిపికి.. 24% శాతం వైకాపాకు..10శాతం జనసేనకు ..!

తేల్చిన చెప్పిన సర్వే...! టిడిపిలో ఆనందం...!

ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికార టిడిపినే గెలుస్తుందని ఓ సర్వే తేల్చి చెప్పింది. గతంలో నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల సందర్భంగా సర్వే నిర్వహించిన సంస్థే ఈ సర్వేను నిర్వహించిందని తెలుస్తోంది. అప్పట్లో...ఆ సర్వే ఫలితాలను ఎక్కువ మంది నమ్మలేదు. అయితే..ఉప ఎన్నికల తరువాత...వారి అంచనాలు వందశాతం నిజం అయ్యాయి. ఈ సంస్థ సర్వే ప్రకారం ఎన్నికలు 2018 డిసెంబర్‌లో జరిగితే... 58శాతం ఓట్లతో టిడిపి 139 సీట్లు సాధిస్తుందని, 24% శాతం ఓట్లతో వైకాపాకు 28 సీట్లు..10శాతం ఓట్లతో..'జనసేన'కు 9 సీట్లు లభిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ప్రకారమే ఈ సంస్థ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టిడిపి ప్రభంజనం సృష్టిస్తుందని ఆ సర్వే వెల్లడించింది. వైకాపాకు గట్టిపట్టున్న 'రాయలసీమ'లో గతంలో 'జగన్‌'పార్టీ సాధించిన స్థానాలను ఆ పార్టీ నిలబెట్టుకోవడం కష్టమని తెలుస్తోంది. అదే విధంగా గతంలో ఆ పార్టీ సాధించిన స్థానాల్లో సగానికి పైగా కోల్పోనుంది. ప్రస్తుతం వైకాపాలో 43 మంది ఎమ్మెల్యేలు ఉండగా..వీరు కూడా గెలిచే పరిస్థితి లేదని తేలుతోంది. ఈ సర్వే వివరాలను ముందు పెట్టుకునే ఇటీవల జరిగిన టిడిపి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాము 135సీట్లు గెలువబోతున్నామని, మిగతా నియోజకవర్గాల్లోనూ గెలవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని, పనిచేసే ప్రభుత్వంగా ప్రజలు గుర్తించారని నాయకులు, ఎమ్మెల్యేలు మరింత కష్టపడితే..మరిన్ని స్థానాల్లో గెలుస్తామని ఆయన వర్క్‌షాప్‌లో చెప్పారు. ఈ సర్వే వివరాల ఆధారంగానే ఆయన తాము ఎన్ని సీట్లు గెలవబోతున్నామో..ముందుగా చెప్పారని వారు అంటున్నారు.

   ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత...నవ్యాంధ్ర తీవ్రమైన ఆర్థికలోటుతో ఉన్నా..ఎవరికీ ఎటువంటి కష్టం కల్గించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేస్తున్నారనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉందని ఈ సర్వే తేల్చింది. ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని, చేతిలో రూపాయి లేకపోయినా..సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చేస్తున్నారని, ఆయనకు నిధుల కొరత లేకుంటే...ఇప్పటికే అద్భుతాలు చేసేవారని..తేలిందట. అదే సమయంలో కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా...రాయలసీమకు శ్రీశైలం ద్వారా సాగునీరు ఇచ్చి..ఆ ప్రాంత ప్రజలు మనస్సులను చూరగొన్నారట. ఇక మరో వైపు పెన్షన్లు, చంద్రన్నభీమా వంటి కార్యక్రమాలు అద్బుతంగా ఉన్నాయని ప్రజల నుంచి కితాబులు వస్తున్నాయి. నిధుల లేమితో రాజధానిని నిర్మించలేక పోతున్నారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయడం లేదనే మాట ఎక్కువ మంది నుంచి వినిపిస్తోందట. అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకుంటామన్న వారు..అన్యాయం చేశారని, వారిని క్షమించే పరిస్థితి లేదని తేల్చారట. అదే సమయంలో కొంత మంది టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిల పనితీరుపై వారు పెదవి విరిచారట. ప్రజాప్రతినిధులు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే...ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును కొనియాడుతున్నారట. అంటే మొత్తం మీద కొంత మందిపై వ్యతిరేకత ఉన్నా..మరోసారి 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే మాట ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారట.

   ఇక వైకాపా ప్రతిపక్షంగా విఫలమైందని...ఆ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా..పదవులు కోసం ప్రాకులాడుతుందనే మాట ఓటర్ల నుంచి వ్యక్తం అవుతోందట. కొన్ని వర్గాలు ఇంకా వైకాపా వైపు బలంగా ఉన్నా..వారు కూడా 'జగన్‌' గెలవలేడనే అభిప్రాయంతో ఉన్నారని సర్వే తేల్చింది. అయితే 'జగన్‌' సామాజికవర్గం, ఎస్సీ,ముస్లిం వర్గాల ఓటర్లు..'జగన్‌'కు అండగా ఉన్నారని..వారు 'జగన్‌'కే తమ ఓటు వేస్తామని చెబుతున్నారట. అదే సమయంలో 'వైకాపా' క్షీణించిందన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారట. పలువురు నాయకులు టిడిపిలోకి వలసలు వెళ్లడంతో పార్టీ బలహీనపడిందనే అభిప్రాయం వారిలో ఉందట. అదే సమయంలో బిజెపితో 'జగన్‌' కలుస్తారనే మాట...ముస్లిం వర్గాల్లో కలకలం సృష్టిస్తుందని..ఒకవేళ 'జగన్‌' బిజెపితో వెళితే..ఆ పార్టీ ఇంకా నష్టపోతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో సినీనటుడు 'పవన్‌ కళ్యాణ్‌' గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఆయన సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే ఆయన వెంట ఉన్నారని..మిగతా వర్గాలు ఆయనను సీరియస్‌గా తీసుకోవడం లేదని సర్వే తేల్చింది. ఇదే సమయంలో ఆయన మాత్రం కొంత మేర ఓట్లను చీల్చగలరని..అది టిడిపికే ఉపయోగపడుతుందని..విశ్లేషించింది. ప్రాంతాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే...!

రాయలసీమ:(51) టిడిపి (40) వైకాపా (10) జనసేన(1) చిత్తూరు (14) టిడిపి:11 వైకాపా:3, కడప(10) టిడిపి 7, వైకాపా 3, అనంతపురం(14) టిడిపి11, వైకాపా 2, జనసేన 1, కర్నూలు (14)టిడిపి 12, వైకాపా 2.

కోస్తాంద్ర:(89) టిడిపి:72, వైకాపా 10: జనసేన:7, తూర్పుగోదావరి(19)టిడిపి 14, వైకాపా2, జనసేన 3; ప.గో(15) టిడిపి 12, వైకాపా1, జనసేన 2,  కృష్ణా(16) టిడిపి 14, వైకాపా1, జనసేన1, గుంటూరు(17) టిడిపి 15, వైకాపా 2, ప్రకాశం(12) టిడిపి 9, వైకాపా 2, జనసేన 1, నెల్లూరు(10) టిడిపి 8, వైకాపా 2:

ఉత్తరాంధ్ర:(33) టిడిపి:24, వైకాపా :8, జనసేన 1, శ్రీకాకుళం(10) టిడిపి 7, వైకాపా 3, విజయనగరం(9) టిడిపి 6, వైకాపా 3, విశాఖ(14) టిడిపి 11, వైకాపా 2, జనసేన1.

నంద్యాల,కాకినాడ ఉప ఎన్నికల దగ్గర నుంచి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వర్గాలను కలసి వారి అభిప్రాయాలను తెలుసుకుందట. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించి..ఎక్కువ శాతం శాంపిల్స్‌ తీసుకుందని తెలుస్తోంది. ఢిల్లీ, నోయిడా నుంచి వచ్చిన ఈ సంస్థ ప్రతినిధులు గత నాలుగు నెలల నుంచి సర్వే నిర్వహించారని తెలుస్తోంది. సమాజంలోని ప్రతివర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతానికి చెందిన ప్రతినిధులందరితోనూ వీరు కలసి అభిప్రాయాలను తెలుసుకొన్నారట. తాము నిర్వహించిన సర్వేలో నూటికి నూరుశాతం సక్సెస్‌ ఉన్నదని, గతంలో తాము నిర్వహించిన ఏ సర్వే కూడా తప్పుకాలేదని వీరు చెబుతున్నారట. మొత్తం మీద..ఈ సర్వే టిడిపిలో ఉత్సాహం నింపుతుండగా.. వైకాపాలో నిరుత్సాహానికి గురిచేస్తోంది.


(5317)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ