లేటెస్ట్

9 నుంచి అసెంబ్లీ సమావేశాలు...!

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సారి శాసనసభా సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ దఫా బడ్జెట్‌ సమావేశాలు  వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం విదితమే. విద్యుత్తు కొనుగోళ్ళ ఒప్పందాల అంశం సభలో దుమారం రేపుతుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కాగా ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్న బీజేపీ... శాసనసభలో ఎలాంటి వ్యూహాన్ని పాటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే. 

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ