WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సికింద్రాబాద్‌' నుంచి 'సమంత' పోటీ చేస్తుందట...!

సినీ హీరోయిన్‌ 'సమంత' రాజకీయాలపై ఆసక్తితో ఉందట. ఇటీవలే 'అక్కినేని' వారి కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన 'సమంత' తాజాగా తన దృష్టిని రాజకీయాలపై కేంద్రీకరించిందని ప్రచారం జరుగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో ఆమె సంబంధాలను నెరుపుతోంది. మున్సిపల్‌ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే ఆమెను తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించి ఆమె సేవలను వాడుకుంటోంది. తాజాగా ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వస్తే ఎలా ఉంటుందనే విషయంపై 'కెటిఆర్‌' 'సమంత' మామ 'అక్కినేని నాగార్జున'తో చర్చించారని వార్తలు వస్తున్నాయి. క్రిస్టియన్‌ మతానికి చెందిన 'సమంత' 'నాగార్జున' కుమారుడైన 'నాగచైతన్య'ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఉన్న 'సమంత' తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టిపట్టుదలతో ఉందట. ఇప్పటికే అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న 'నాగార్జున' కుటుంబం...'సమంత' కోరికకు ఓకే చెప్పిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తే...సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

 గతంలో ఇదే నియోజకవర్గం నుంచి సినీనటి 'జయసుధ' పోటీ చేసి గెలుపొందారు. క్రిస్టియన్‌ మతస్తులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అదే మతానికి చెందిన మహిళను పోటీకి దించితే...గెలుపు సులువతుందని...టిఆర్‌ఎస్‌ వర్గాల అభిప్రాయమట. అయితే ప్రస్తుతం..ఇక్కడ.. నుంచి గెలిచి మంత్రివర్గంలో ఉన్న 'పద్మారావు'ను ఎక్కడ పోటీకి దింపుతారనే విషయం ఆసక్తిని కల్గిస్తోంది. ఒకవేళ 'సమంత' ఇక్కడ నుంచి పోటీ చేస్తే...'పద్దన్న' పరిస్థితి గందరగోళంగా తయారవడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద చిన్న వయస్సులోనే 'సమంత' రాజకీయాల్లోకి దిగితే...సినీనటులకు మార్గదర్శిగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


(503)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ