WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజస్థాన్‌లో బిజెపికి ఘోరపరాజయం...!

రాజస్థాన్‌ ప్రజలు లగాయించి కొట్టారు...! ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏమిటి..? ఇప్పుడు చేస్తోందేమిటంటూ..అధికార బిజెపిపై తమ ఆగ్రహాన్ని చూపించారు. రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. 'అజ్మీర్‌, ఆల్వార్‌ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. రెండు చోట్లా లక్షకు పైగా మెజార్టీ సాధించింది. అదే విధంగా 'మండల్‌ఘర్‌' అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అధికార బిజెపి అభ్యర్థిపై 10వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. దీంతో..అధికార బిజెపిపై రాజస్థాన్‌ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. 

  ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలు ఇక్కడ ఉంటే...ఇక్కడ బిజెపి 24 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. మూడున్నరేళ్లలోనే ఇప్పుడు బిజెపి ప్రభ రోజు రోజుకు కొడిగడుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడే..ఇంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బిజెపి పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘోరపరాజయానికి దారులు వేసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందస్తు ఎన్నికలకు ముహూర్తాలు సిద్ధం చేసుకుంటున్న 'మోడీ,షా బ్యాచ్‌కు 'రాజస్తాన్‌' ఉప ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపిస్తున్నాయి. మరి ఈ ఫలితాలతో..ముందస్తుకు వెళ్లడానికి ఈ జోడీ సిద్ధపడదేమో...! ఉన్న టైం కాస్తా...కాలక్షేపం చేసి...హాయిగా 'రాహుల్‌గాంధీ' చేతికి అధికారాన్ని అప్పగించి వెళ్లిపోతారేమో..! చూస్తుంటే..అదే విధంగా ఉంది..పరిస్థితి...!


(618)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ