WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోహ్లీ సెంచరీ:భారత్‌ గెలుపు...!

దక్షిణాఫ్రికా పర్యటనలో మరోసారి 'కోహ్లీ' రెచ్చిపోయాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో రెండు జట్లల్లో అత్యుత్తమ ఆటతీరును కనబర్చిన 'కోహ్లీ' (112) వన్డేలోనూ అదే ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో గురువారం నాడు డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ కోహ్లీ సెంచరీ...మరో ఆటగాడు 'రహానే' అర్థ సెంచరీ సాధించడంతో భారత్‌ సులువుగా గెలుపొందింది. కోహ్లీకి వన్డేలో ఇది 33వ సెంచరీ. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్‌శర్మ, దావన్‌లు శుభారంభం ఇచ్చారు. 20 పరుగులు చేసిన 'రోహిత్‌శర్మ'ను మోర్కెల్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తరువాత కెప్టెన్‌ కోహ్లీ, ధావన్‌లు వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే..కోహ్లీ చేసిన పొరపాటు కారణంగా 'ధావన్‌' రనౌట్‌ అయ్యాడు. అయితే..తరువాత వచ్చిన 'రహానే' తొలుత నిదానంగా ఆడినా..తరువాత పుంజుకుని తనదైన శైలిలో ఫోర్లు,సిక్స్‌లు బాది, దక్షిణాఫ్రికాలో తనకు తిరుగులేదని నిరూపించాడు. 

  తనను టెస్టుల్లోకి తీసుకోకపోవడం ఎంత తప్పో కెప్టెన్‌ కోహ్లీకి తెలిసేలా ఆడాడు. మరో వైపు కోహ్లీ కూడా జోరుగా ఫోర్లు,సిక్స్‌లతో స్కోరుబోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ కలసి 3వ వికెట్‌కు 189 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అయితే విజయానికి మరో 14 పరుగులు చేయాల్సిన సమయంలో 'రహానే' అండిల్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. 'రహానే' మొత్తం 86 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన 'కోహ్లీ'ని అండిల్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి మరో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా...ధోనీ..లాంఛనాన్ని పూర్తి చేశాడు. మొదటి వన్డేలో గెలిచి భారత్‌ సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. అంతకు ముందు అందరు బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా..సఫారీల కెప్టెన్‌ డుప్లెసస్‌ సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నారు. భారత్‌ బౌలర్లల్లో కులదీప్‌కు మూడు విక్కెట్లు దక్కగా, చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి..బ్రుమా, కుమార్‌లకు చెరో వికెట్‌ లభించింది.


(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ