WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

15 సీట్ల పార్టీని పట్టించుకోం....అన్నారట‌...!

ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే...నెరవేర్చకుండా...ఆంధ్రా ప్రజలను మరింత చిన్నబుచ్చుతున్నారు...కేంద్రంలోని బిజెపి పెద్దలు. ఎన్నికలకు ముందు..ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని ఆ పార్టీ పెద్దలు..ఇప్పుడు రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తే..చిరాకుపడుతున్నారట. కేంద్ర బడ్జెట్‌లో...రాష్ట్రానికి అన్యాయం జరిగిందని...రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని..ఏదో ఒకటి చేయాలని..ఇటీవల బిజెపికి చెందిన నేతలు...పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో చెప్పారట. అంతే కాకుండా..ఎన్‌డిఎలో ఉన్న టిడిపి పార్టీ తీవ్ర అసంతృప్తిలో ఉందని, ఆ పార్టీ..ఎన్‌డిఎ నుంచి బయటకు వెళ్లిపోతుందని, దీంతో..ఇబ్బందులు వస్తాయని..ఓ సీనియర్‌ బిజెపి నేత ఆయనతో ప్రస్తావించగా..ఆయన తీవ్రంగా స్పందించారట. 'అసలు..వాళ్లెంత...? వాళ్ల పార్టీ ఎంత..? వాళ్లు ఎన్‌డిఎ నుంచి బయటకు వెళితే..నష్టమేమిటి..? ఆ పార్టీ బలమెంత...? ఆఫ్ట్రాల్‌ 15సీట్ల పార్టీ...వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు... మీ పని మీరు చేసుకోండని' హుంకరించారట. దీంతో ఆ సీనియర్‌ నేత మౌనం వహించి బయటకు వచ్చి..ఏదేదో..చెప్పుకున్నారట. 

    కేంద్ర పెద్దలు ఈ రకంగా వ్యవహరించడానికి రాష్ట్రానికి చెందిన ఓ నేత ఇస్తోన్న సమాచారమేనన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని అధికార టిడిపిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఆ పార్టీ నుంచి 15మంది కంటే..ఎంపీలు గెలవరని..వారితో ఒరిగేదేమీ లేదని..ఆయన బిజెపి పెద్దలతో చెబుతున్నారట. తమది జాతీయ పార్టీ అని...ఒంటరిగా దేశంలో అధికారంలోకి వచ్చామని...15సీట్ల పార్టీతో తమకేమిటని..ఇంతకు ముందు..ఈ నేత...రాష్ట్రంలో మాట్లాడారు..ఇప్పుడు ఇదే విషయాన్ని..ఢిల్లీ పెద్దలకు నూరిపోశారని..దీంతో..వారు కూడా ఆయన బాటే పట్టారనే మాట వినిపిస్తోంది. మొత్తం మీద..ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా...నమ్మించి గొంతు కోసిన..బిజెపి..సీట్ల సంఖ్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే...! సీట్ల సంఖ్యతో...మూటలు ఇస్తామంటున్న ఆ పార్టీకి ఒకప్పుడు రెండు సీట్లు కూడా లేవన్న సంగతిని విసర్మించి...ఇప్పుడు ఇతర పార్టీలను ఎద్దేవా చేస్తోంది. ఇటువంటి ఎద్దేవాలతోనే...అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ..పత్తా లేకుండాపోయింది..అదే గతి ఇప్పుడు..కాషాయ పార్టీకి కూడా పట్టబోతోంది. ఆంధ్రుల సత్తా ఏమిటో..త్వరలోనే..ఈ పార్టీకి తెలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది.


(1226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ