లేటెస్ట్

మూడు నెలల పాలనలో అంతా అరాచకమే...!

వైసిపి దాడుల్లోని టిడిపి బాధితు లకు గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు టిడిపి అధ్య క్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంగ ళవారం ఉదయం టిడిపి నేతలతో చంద్ర బాబు టెలికానారేెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడున్నర నెలల్లో వైసిపి అరా చకాలకు అంతే లేకుండా పోయిందని విమ ర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, ఆస్తుల ధ్వంసం, భూముల కబ్జాలు, సామూహిక దాడులు, వేధింపులు, అక్రమ కేసులకు లెక్కేలేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికి ఉందని, దేశంలో నివసించే హక్కును ఎవ రూ కాలరాయలేరని అన్నారు. ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించా ల్సింది పోలీ సులేనని, పోలీసులే నిస్సహాయు లైతే పరిస్థి తులు ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. వైసిపి దాడుల్లోని టిడిపి బాధితు లకు టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అం దులో భాగంగానే.. గుంటూ రులో బాధితుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధితులంతా గుంటూరు శిబి రానికి తరలి రావాలని కోరారు. అవసరమై తే తానే స్వయంగా బాధితులను వాళ్ల గ్రామాలకు తీసుకుని వెళతానన్నారు. జిల్లా పార్టీ నాయకులు అందరిని సమన్వయం చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొ న్నారు. అధికారం శాశ్వితం కాదని, అధికా రం ఉందని విర్రవీగితే సహించేది లేదని, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.అవసరమైతే తాను ధర్నాకు కూర్చుంటానని, వైకాపా దౌర్జన్యాలను సహించనన్నారు. 

(277)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ