'కన్నా,కావూరి,పురంధేశ్వరి'లో ఆలోచనే వేరు..!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కన్నా,కావూరి,పురంధేశ్వరి'లో ఆలోచనే వేరు..!?

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో బిజెపిలో చేరిన మాజీమంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు మళ్లీ రాజకీయంగా ఎదగాలంటే టిడిపితో పొత్తు ఉంటే సాధ్యపడదని తెలుసు. అందుకేనేమో..బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకోవాలని తెరవెనుక ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. 'జగన్‌' పార్టీతో పొత్తు కుదుర్చుకుని గత వైభవాన్ని పొందవచ్చని ఆ ముగ్గురు ఆశపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..రాష్ట్రంలో 'చంద్రబాబు', 'జగన్‌'ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఆముగ్గురికి తెలుసు. తెలుగుదేశంతో పొత్తు ఉన్నా..కావూరికి, కన్నాకు పోటీ చేసే అవకాశం రాదు. అదే విధంగా 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన 'పురంధేశ్వరి' ఈసారి ఎంపిగా విజయం సాధించాలంటే..అనంతపురం జిల్లా హిందూపురం నుంచి విశాఖపట్నంనుంచి కానీ పోటీ చేస్తేనే సాధ్యపడుతుంది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో టిడిపి బలంగా ఉండడంతో..ఆపార్టీ సహకారం ఉంటేనే ఆమె విజయం సాధించగలమని ఆమెకు తెలుసు. కానీ..అందుకు 'చంద్రబాబు' అంగీకరించరని కూడా ఆమెకు తెలుసు. 'జగన్‌' పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే కన్నా, కావూరి, పురంధేశ్వరిలు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. ఈ ముగ్గురు వ్యవహారశైలిపై విశాఖపట్నం ఎంపి హరిబాబు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'కావూరి, కన్నాలు మొదటి నుంచి మౌనం వహిస్తూనే ఉన్నారు. 

  కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులు, మరియు చంద్రబాబుకు బద్దవ్యతిరేకులైన ఈ గురుశిష్యులిద్దరూ మళ్లీ రాజకీయంగా ఎదగాలంటే..టిడిపితో పొత్తు ఉంటే సాధ్యపడదని తెలుసు. 'జగన్‌' పార్టీలో చేరినా..ఆయన గుర్తిస్తారన్న నమ్మకం వీరిద్దరికీ లేదు. అందుకే..టిడిపిలోనే కొనసాగుతూ బిజెపితో పొత్తు తెగతెంపులు చేసుకుంటే..జగన్‌తో పొత్తు ఖాయమనే సంగతి వారికి తెలుసు. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఒక వెలుగు వెలిగిన పురంధేశ్వరి మళ్లీ బిజెపితో ఎంపిగా విజయం సాధించలేనని ఆమెకు తెలుసు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ కుమార్తెగా గుర్తించిన ఓటర్లు..ప్రస్తుతం ఆమెను..అదే విధంగా చూసేందుకు సిద్ధంగా లేరు. రాజకీయంగా మళ్లీ..గత వైభవం పొందాలంటే..'జగన్‌' పార్టీతోనే పొత్తు ఉంటేనే సాధ్యమవుతుందని తెలుసు. కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులైన ఈ ముగ్గురిని బిజెపిలో చేర్చుకోవడమే పెద్ద తప్పు అని రాష్ట్ర బిజెపి నేతలు వాపోతున్నారు. ఎవరి ఆలోచన..ఎవరి ఆశలు వారివి. రాజకీయభవిష్యత్‌కోసం ఆడుతున్న ఆటలో ఈ ముగ్గురి భవిష్యత్‌ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ