WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమెరికాలో కాల్పులు :17మంది మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత త‌ల్ల‌డింది.ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు మారణహోమం సృష్టించాడు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పార్క్‌ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో చదువుతున్న నికోలస్‌ క్రజ్‌(19)పై కొద్దిరోజుల క్రితం పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుని, అతడిని సస్పెండ్ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన క్రజ్.. పాఠశాలలోకి చొచ్చుకొచ్చి విచాక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి, మిగతా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

(357)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ