లేటెస్ట్

వైకాపా మృగాల దాడులను అరికట్టండి:లోకేష్‌

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే టిడిపి కార్యకర్తలపై 500సార్లు దాడులు చేశారని, ఆ మృగాల దాడులను సిఎం జగన్మోహన్‌రెడ్డి చూస్తూ ఎంజాయి చేస్తున్నారని, ఇప్పటికైనా దాడులను ఆపాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ డిమాండ్‌ చేశారు. పుట్టపర్తి నియోకవర్గంలో పార్టీ కార్యకర్తల తలలను వైకాపాకు చెందిన వారు పగలగొట్టారని, వైకాపా పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు టిడిపి నేతలపై దాడి చేసి 'జగన్‌'కు అంకితం చేశారని 'లోకేష్‌' విమర్శించారు. 'పుట్టపర్తి' నియోజకవర్గంలో వైకాపా మృగాలు టిడిపి నేతలపై మహిళలపై, వృద్ధులపై విచక్షిణారహితంగా దాడులు చేస్తున్నారని మీ మృగాల దాడులను ఆపాలని ఆయన ట్విట్టర్‌లో కోరారు. గత ఐదేళ్లుగా రాష్ట్రం పచ్చగా ఉందని, నేడు తుగ్లక్‌ పాలనలో రాష్ట్రం రక్తమోడుస్తోందని 'లోకేష్‌' మండిపడ్డారు.వైకాపా రాక్షసులకు తెదేపా కార్యకర్తల రక్తం కళ్ల చూడందే నిద్ర రావడం లేదని, ఇకనైనా ఈ మారణహోమం ఆపాలని, లేదంటే కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. 

(182)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ