WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బొత్స' అవినీతిపై విస్తుపోయిన కేంద్రమంత్రి 'అశోక్‌'...!

కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కొద్ది రోజుల కిందట విజయనగరంలో అవినీతి నిరోధకశాఖ కార్యాలయాన్ని ప్రారంభింపచేస్తూ...అవినీతిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  గతంలో తాను టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నాను..అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. విజయనగరం జిల్లాలో మంత్రిగా ఉన్న ప్రబుద్ధుడి(బొత్సా అవినీతిని పరోక్షంగా చెబుతూ) అవినీతిని వివరించారు. అశోక్‌ పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంలో ఒక వృద్ధురాలు ఎదురు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెకు ఏమైనా వ్యక్తిగత ఆర్థిక సహాయం కోసం..అక్కడకు వచ్చిందని..భావించిన 'అశోక్‌' ఎందుకు విలపిస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఇంతకు ముందు ప్రతినెల పెన్షన్‌ వచ్చేది..గత మూడు నెలల నుంచి..సంతకం పెట్టించుకుంటున్నారు కానీ..పెన్షన్‌ ఇవ్వడం లేదని..మళ్లీ కన్నీరుమున్నీరుగా విలపించింది. దాంతో ఆయన తన జేబులో ఉన్న సొమ్మును ఆయన ఆమెకు అందజేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ అవినీతి ఎలా ఉందంటే..చివరకు వృద్ధులకు వచ్చే ఫించన్‌ కూడా సంతకాలు చేపించుకుని కాజేస్తున్నారని..ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదని..ఇటువంటి సంఘటన తనను కలసివేసిందని చెప్పారు. అప్పట్లో విజయనగరంలో కానీ...అప్పటి మంత్రి బొత్సా అనుచరులుగా చెప్పుకుంటున్న వారు ఇటువంటి ఫించన్లు దోచుకునేవారని..అప్పట్లో చాలా మందికి తెలుసు. కానీ..ఆ వృద్ధురాలి సంఘటన ఎమ్మెల్యే హోదా ఉన్న 'అశోక్‌'కు ఎదురుకావడంతో...అప్పట్లో ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎందుకు ఈ విషయం అప్పట్లో చెప్పలేదంటే..ఆయన తాను ఆ వృద్ధురాలికి చేసిన సహాయం గురించి చెప్పుకోవాల్సి వస్తుందనే కారణంతోనేనట. ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే.. ఇటువంటి అవినీతి జరిగితే..సహించవద్దని ఆయన ఏసీబీ అధికారులను ఆదేశించారు. అటువంటి సంఘటలను ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎక్కడా సంభవించలేదని, ఒక వేళ ఏసీబీ అధికారుల దృష్టికి వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోండి..అని తన ప్రసంగంలో చెప్పడం జరిగింది.


(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ