WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కావేరి జలాలపై 'సుప్రీం' తీర్పు...!

తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. కావేరీ జలాల్లో తమిళనాడుకు 177.25 టీఎంసీల జలాలు కేటాయించగా, కర్ణాటకకు 284.75 టీఎంసీల జలాలను అత్యున్నత న్యాయస్థానం కేటాయించింది. ఆ ప్రకారం కర్ణాటకకు అదనంగా 14.5 టీఎంసీల నీరు లభిస్తుంది. కేరళ, పుదుచ్చేరికి జలాల కేటాయింపుల్లో మార్పు లేదు.ట్రిబ్యునల్ గతంలో 30 టీఎంసీల జలాలు కేరళకు, 7 టీఎంసీల జలాలు పుదుచ్చేరికి కేటాయించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. జలాలపై ఏ రాష్ట్రానికీ ఓనర్‌షిప్ హక్కులు ఎవరికీ లేవని కూడా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ తీర్పులో స్పష్టం చేసింది.దశాబ్దాలుగా ఉప్పూనిప్పుగా ఉన్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో శుక్రవారం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర్పు అనంతరం ఎలాంటి ఉద్రక్తతలు తలెత్తినా నిరోధించేందుకు అవసరమైన బలగాలను మోహరించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేశారు. కర్ణాటకకు వెళ్లే బస్సులను తమిళనాడు రద్దు చేయగా, కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు మాత్రం తమిళనాడులోకి మామూలుగానే వస్తున్నాయి.


(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ