WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' అవుట్‌...'అద్వానీ' ఇన్‌...!

గత రెండు మూడు రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రవిచిత్రంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో..ముందు ముందు ఆ ప్రచారాలు నిజం అవుతాయా..? కావా..అనే విషయాలు పక్కనపెడితే..బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తరువాత బిజెపి అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ప్రధాని అవుతారని..ప్రస్తుత ప్రధాని మోడీని తప్పించడం ఖాయమని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కొంత మంది బిజెపి నాయకులు స్పందించేందుకు ముందుకు రావడం లేదు..మరి కొంత మంది దీన్ని కొట్టిపారేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో..ఆ పార్టీకి సమఉజ్జీగా ఉన్న 'బిజెపి'ని ఎన్నికల్లో గెలిపించారని, మోడీ ఒక్కరినే చూసి ప్రజలు పట్టం కట్టారా..? అప్పట్లో మీడియా 'మోడీ' గురించి అనుకూలంగా ప్రచారం చేసింది. ఈ నాలుగేళ్లలో అంతా వన్‌మ్యాన్‌షోగా పరిపాలన నడిపిస్తున్నారని, గతంలో ప్రధానిగా వాజ్‌పేయి, డిప్యూటీ ప్రధానిగా వాజ్‌పేయిలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు, ఇతరులకు విలువ ఇచ్చారు. ఇప్పుడు..అందుకు విరుద్ధంగా జరుగుతోందని, మోడీ కన్నా ఎంతో సీనియర్‌ అయిన 'రాజ్‌నాథ్‌సింగ్‌'కూడా తాజాగా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఎంపీలు ఆయనను కలిసినప్పుడు..'మోడీ'పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. అద్వానీ వంటి సీనియర్‌నేతను 1984లో కేవలం రెండు సీట్లు గెలిచిన బిజెపిని వంద సీట్లకు తీసుకొచ్చిన ఆయనను విస్మరించడమే కాకుండా..రాష్ట్రపతిని కూడా చేయకుండా...అవమానించడం..ఇప్పుడు మోడీకి ఎసరు తెచ్చిపెట్టబోతోంది. 

  అద్వానీని ప్రధానిని చేయాలని..బిజెపిలో ఒక వర్గం..సిద్ధపడుతుండగా..మరొక వర్గం..మోడీకి మద్దతు పలుకుతున్నారని ఢిల్లీ అధికారవర్గాల సమాచారం. ఏది ఏమైనా..ప్రధాని మోడీని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసిన మీడియా తాజా పరిణామాలపై 'మోడీ'పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కథనాలు ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్న అద్వానీ ప్రధాని అయితే..రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని టిడిపి ఎంపీలు చెబుతున్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే ఓటర్లు పట్టం కడతారని..మీడియా వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. కర్ణాటకలో అధిక సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు ఎపికి అన్యాయం జరగడంపై భరించలేకపోతున్నారు. నిన్నటి వరకు 'మోడీ'కి మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అద్వానీ నిజాయితీపరుడిగా పేరుంది.ఆయనపై ఇంత వరకు ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అద్వానీ బాధ్యతలు నిర్వహిస్తే..మళ్లీ ఎన్‌డిఎ అధికారంలోకి రావడం ఖాయమని ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రచారం ఎక్కడ నుంచి ప్రారంభమయిందో తెలియడం లేదు. ప్రధాని మోడీని పదవి నుంచి తప్పించడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి కొద్ది రోజులు గడిస్తే కానీ..అసలైన వాస్తవాలు వెల్లడి కావు.

(2566)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ