WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా' ద్రోహి 'జైరాం రమేష్‌'...!

పార్లమెంట్‌ తలుపులు మూసి..ఆంధ్రాను అడ్డగోలుగా విభజించి..అన్యాయం చేసిన నేతలే..ఇప్పుడు... తాము..అన్యాయం చేశామని...దాన్ని సరిచేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు న్యాయం చేయమన్న 'చంద్రబాబు'ను ఎగతాళి చేసి...రాజకీయ ప్రయోజనం ఆశించి...ఆంధ్రా ప్రజలను రోడ్డుపైకి విసిరేసిన వాళ్లల్లో ప్రథముడైన 'జైరాం రమేష్‌' తాజాగా చెబుతున్న సూక్తులు వింటుంటే..సగటు..ఆంధ్రా పౌరుని రక్తం సలసలా మరిగిపోతోంది. నాడు విభజన చట్టం రాసి...ఆంధ్రులను తరిమేసిన 'రమేష్‌' ఇప్పుడు..తాను రాసిన చట్టాన్నిమార్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. పైగా...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారని..తమ వద్ద ఆధారాలు ఉన్నాయని విమర్శలు గుప్పిస్తూ చెలరేగిపోతున్నాడు. 

 నాడు బిజెపితో కలిసి...ఆంధ్రాను విభజించిన 'రమేష్‌'..ఇప్పుడు మరోసారి ఆ గాయాన్ని కెలికి ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిందని భావిస్తే...మళ్లీ చట్టం చేసుకోవాలని సలహా ఇస్తున్న 'రమేష్‌'...పార్లమెంట్‌లో ఆంధ్రా ఎంపీలు..ఆందోళన చేస్తుంటే... ఎందుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వలేదు. టిడిపి ఎంపీలు పార్లమెంట్‌ను అడ్డుకుంటుంటే...వారిపై దాడి చేసిన తన అక్కసు తీర్చుకున్న సంగతి 'రమేష్‌'కు తెలియదా...? తప్పుడు పనులు చేసి..మళ్లీ ఆరోపణలు చేస్తున్న ఇటువంటి ఆంధ్రా ద్రోహులను రాష్ట్ర సరిహద్దుల్లోనే తరిమి తరిమి కొట్టాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఈ అపరమేధావి..ఆ కృతజ్ఞతను కూడా మరిచిపోయి..ఆంధ్రా ప్రజలను అవహేళన చేస్తూ...తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే..నీచుల కన్నా హీనం. ఆంధ్రా పేరుతో మంత్రి పదవి సంపాదించుకుని..ఆనక..ఆంధ్రాకు ద్రోహం చేసిన..ఈ ద్రోహీని ఎక్కడికక్కడే అడ్డుకుని బుద్దిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(1187)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ