WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా' వస్తానంటున్న 'మోడీ'..వద్దంటున్న 'బాబు'...!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు...! కొంత మంది కాలం ఒక అవకాశం ఇస్తుంది...ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేస్తే...కలకాలం వారిని గుర్తుపెట్టుకుంటారు.. ప్రజలు..! అదే తమంత వీరుడు లేడని విర్రవీగితే..అదే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారు...! అచ్చం..ప్రధాని మోడీ పరిస్థితి అదే విధంగా...ఉంది. దేశం మొత్తం ఒక వ్యక్తిని ఆరాధించి..మీ అంత నాయకుడు లేడని..పట్టం కడితే...కోరి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా..వ్యక్తిగత రాగద్వేషాలతో కాలం గడిపేస్తే..చివరకు ఏమవుతుందో...'మోడీ'ని చూస్తేనే తెలుస్తుంది. ఎన్నికల సమయంలో అడగని వరాలను కూడా కురిపించి ఓట్లు వేయించుకుని..ఇప్పుడు..వాటిని నెరవేర్చమంటే..అడ్డం తిరుగుతూ నిన్న మొన్నటి దాకా... ఎదురుదాడి చేసిన బిజెపి పెద్దలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చేసిన తప్పును దిద్దుకునేందుకో..మరోసారి...ప్రజలను ఏమార్చేందుకో...ఆంధ్రాకు వచ్చి...వారిని ప్రసన్న చేసుకుందామని.. భావిస్తుంటే...ప్రజలు, నాయకులు..మీరు రావద్దు..మహాప్రభో..అంటున్నారు.

  ఇప్పటికిప్పుడు మీ రాష్ట్రంలో..ప్రధాన మంత్రి స్థాయిలో ప్రారంభించాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయా..? ఉంటే ప్రధానమంత్రి 'ఆంధ్రా'కు వస్తారని..ఒకటి రెండు రోజుల నుంచి ఢిల్లీ నుంచి ఆంధ్రా ప్రభుత్వానికి ఒకటే సందేశాలు వస్తున్నాయి. ఈ సందేశాలను చూసి ఆశ్చర్యపోవడం..పాలకుల వంతైంది. అప్పుడు రమ్మంటే..రానని మొరాయించిన పెద్దమనిషి..ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని..ఇక్కడకు వస్తారని...లోలోన ప్రశ్నించుకుంటూ..వారి సందేశాలకు స్పందించడమే మానేశారు. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద చర్చకు వచ్చినప్పుడు.. ఇప్పుడు..ఆయన వచ్చి చేసేదేముంది..అంతా అయిపోయిన తరువాత...అనే మాట వినిపించిందట. దీంతో...ప్రధాని మోడీ బృందం మీరు కాకపోతే...మాకు కెసిఆర్‌ ఉన్నాడని...ఇప్పుడు తాజాగా... హైదరాబాద్‌ పర్యటనకు వస్తామని సందేశాలు పంపుతున్నారట. మరి కెసిఆర్‌...'మోడీ'ని ఆహ్వానిస్తారా..? లేక..నాకెందుకు..లేని పోని...వృధా ప్రయాస..అంటూ ఆంధ్రా బాటలోనే తోసిపుచ్చుతాడా..? ఏమో చూడాలి..మరి.


(1122)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ