WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తెలుగుదేశాని'కి మద్దతు ఇస్తాం:జగన్‌

కేంద్ర ప్రభుత్వంపై అధికార తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం తీర్మానాన్ని పెడితే..తాము మద్దతు ఇస్తామని వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఆయన తన పాదయాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా కందకూరులో ఈ ప్రకటన చేశారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతు ఇస్తామని..అదీ ప్రత్యేక హోదా కోసమైతేనే మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. మా పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెడితే మద్దతుగా సంతకాలు చేస్తారు...మీ పార్టీ దానికి సిద్ధంగా ఉందా..? అని ఆయన సవాల్‌ విసిరారు. తనపై కేసులు రాకుండా ప్రత్యేకహోదా వద్దని చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీపడ్డారని, అందుకే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా..రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, తన అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే 'చంద్రబాబు' కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. కాగా..మార్చి5వ తేదీన టిడిపి మంత్రులు రాజీనామా చేస్తారని వస్తోన్న వార్తలతో తాము రాజకీయంగా వెనుకబడతామనే ఉద్దేశ్యంతోనే 'జగన్‌' ఇప్పుడు అవిశ్వాసం ప్రతిపాదన తెచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. అవిశ్వాసం పెట్టి...చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని..భావించే ఆయన ఈ రకమైన ప్రకటన చేశారని వారు అంటున్నారు. మొత్తం మీద..కేంద్రంపై అవిశ్వాసంతో..ఒకరు..రాజీనామాలతో మరొకరు ఒత్తిడి తెస్తే..రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరుగుతుందనే కాదనలేని నిజం. మరి ఈ ఒత్తిడికి 'మోడీ' తలొగ్గుతారా..? లేదో చూడాలి.


(571)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ