టీ-20లో భారత్‌ గెలుపు...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీ-20లో భారత్‌ గెలుపు...!

సఫారీలను వన్డేల్లో చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌...టీ-20 తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి సఫారీలకు భారీ టార్గెట్‌ ఇచ్చింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ, దావన్‌లు భారత్‌కు శుభారంభం ఇచ్చి..వారు ఇచ్చిన శుభారంబాన్ని తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ అందుకోవడంతో..స్కోరుబోర్డు పరుగులు తీసింది. ప్రతి ఓవర్‌లో పది పరుగులకు తగ్గకుండా..పరుగులు సాధించింది. ముఖ్యంగా ధావన్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. మొత్తం 39 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో 72 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. రోహిత్‌ శర్మ 9 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 21 పరుగులు చేయగా, కోహ్లీ(26), రైనా(15) పాండే (29) ధోనీ(16) పాండ్యా(13) పరుగులు సాధించి తమ వంతు సహాయం చేశారు. 

  204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన సఫారీలు లక్ష్యాన్ని అందుకోవడానికి బాగానే ప్రయత్నం చేశారు. అయితే..భవనేశ్వర్‌ కుమార్‌ 17వ ఓవర్‌లో మూడు వికెట్లు తీసి సఫారీలను భారీ దెబ్బ కొట్టాడు. దీంతో..లక్ష్యం దిశగా వెళుతున్న దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కూలిపోయింది. ఆదిలోనే కుమార్‌ స్కట్‌ను అవుట్‌ చేసి సఫారీల పతనానికి శ్రీకారం చుట్టారు. తరువాత డుమినీ, మిల్లర్‌లు వెంట వెంటనే అవుట్‌ అవడంతో ధక్షిణాఫ్రికా 63 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే..మరో ఓపెనర్‌ హెన్రిక్స్‌ గట్టిపట్టుదలతో ఆడాడు. అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ ప్రమాదకారిగా మారాడు. అతనికి బహరిద్దీన్‌ సహకరించడంతో 17 ఓవర్లు ముగిసే సరికి సఫారీల స్కోరు 154/4గా లక్ష్యం వైపు వెళుతున్నట్లు కనిపించింది. 18 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో కుమార్‌ మ్యాజిక్‌ మొదలైంది. ఆ ఓవర్‌ తొలి బంతికి ప్రమాదకరంగా ఉన్న హెన్రిక్స్‌న్‌ అవుట్‌ చేసి భారత్‌ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. రెండవ బంతికి రెండు, మూడవ బంతికి రెండు పరుగులు చొప్పున ఇచ్చిన కుమార్‌ నాల్గవ బంతికి కలిసిన్‌ను ఐదవ బంతికి మోరిసిన్‌ అవుట్‌ చేయగా ఆరవ బంతికి పీటర్సన్‌ రనౌట్‌ అయ్యాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి సఫారీలు పరాజయం అంచున నిలిచారు. దీంతో 18వ ఓవర్‌ ముగిసే సరికి 12 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఉంది దక్షిణాప్రికా తరువాత ఓవర్‌లో బ్రుమా మూడు పరుగులు మాత్రమే ఇవ్వగా ఆఖరి ఓవర్‌లో ఉన్కదత్‌ మరో వికెట్‌ తీయడంతో..సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత్‌ 28 పరుగుల తేడాతో తొలి టీ-20లో విజయం సాధించింది.


(721)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ