WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విపిఆర్‌'ను...'విజసాయి,జగన్‌'లు 'వెర్రిపప్ప'ను చేస్తారా...!?

వైకాపా రాజ్యసభ సభ్యుడిగా విపిఆర్‌(వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) పేరును 'జగన్‌' ప్రకటించారని బాహాటంగా విజయసాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన విపిని చేస్తారా..? లేక విజయం వైపు నడిపిస్తారా...? అనే దానిపై నెల్లూరు జిల్లాలో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సమీప బంధువైన 'విపిఆర్‌' అనేకసార్లు టిడిపిలో చేరేందుకు ప్రయత్నించారు. ఏ కారణాలతో ఆయన చేరిక వెనక్కుపోయిందో..కానీ..నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నాయకులందరూ 'విపిఆర్‌'ను కలసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు అవసరమైతే నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇప్పిస్తామని లేదా...ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమైన కల్పిస్తామని..ఆ రెండింటిలో ఏదో ఒకటి మీరే నిర్ణయించారని వారు చెప్పగా...రాజ్యసభ సీటు ఇస్తేనే పార్టీలో చేరతానని ఆయన పట్టుపట్టారు. 

 ఈ మధ్యలో  'విపిఆర్‌'. 'జగన్‌'తో 'విజయసాయిరెడ్డి' చర్చించిన తరువాత 'విపిఆర్‌'కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. కానీ..నెల్లూరు జిల్లా వైకాపా అభ్యర్థుల ఖర్చును 'విపిఆర్‌' భరించాలని, దానికి సంబంధించిన 'ప్యాకేజీ'ని మరొకరికి అందించాలని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. 'విపిఆర్‌'ను పార్టీలో చేర్పించి..జిల్లాలో పార్టీ బలాన్ని మరింత పెంచుతామని ఉత్తరకుమార్‌ ప్రగల్బాలు పలికిన మంత్రి సోమిరెడ్డికి ఆయన షాక్‌ ఇవ్వడంతో పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఎలా తలెత్తుకోవాలో...తెలియక ఆయన ఇబ్బంది పడుతున్నారు. 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'కి సోమిరెడ్డి ఎలా బంధువు అవుతారో..అని ఆరా తీయగా...'సోమిరెడ్డి'కి సమీప బంధువైన వితంతు మహిళను 'విపిఆర్‌'కు ఇచ్చి వివాహం చేశారట. అప్పటికే ఆమె భర్త చనిపోయి పదేళ్లు గడిచింది. ఈ వివాహాన్ని 'సోమిరెడ్డి' దగ్గరుండి జరిపించారని 'నెల్లూరు'లో చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఆ వితంతువును పెళ్లి చేసుకున్న 'విపిఆర్‌' ఆమె కుమార్తె పెళ్లిని రంగరంగా 'సోమిరెడ్డి' ఆధ్వర్యంలో చేశారట. వందల కోట్లు ఆస్తులు ఉన్న బంధువు దొరికాడని మంత్రి సోమిరెడ్డి సంతోషిస్తున్న సమయంలో ఆయనను కోలుకోలేనంతగా నమ్మకంగా 'విపిఆర్‌' షాక్‌ ఇచ్చారట. 

  'సోమిరెడ్డి' వ్యవహారశైలిపై జిల్లాలో అధికారపార్టీ ప్రముఖుల మధ్య పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యంగ్య విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అసలు విషయం 'చంద్రబాబు'కు తెలియటంతో..ఆయన మంత్రి సోమిరెడ్డిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపాకు 44మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా 'విపిఆర్‌' విజయం సునాయాసమే. అయితే...వీరిలో కొంత మంది ఇద్దరు ముగ్గురు పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి..? రాజ్యసభ సీటు ఇవ్వడమే..మా బాధ్యత.. గెలిపించుకోవాల్సిన బాధ్యత 'వేమిరెడ్డి'దే..అని 'విజయసాయిరెడ్డి' చెబుతున్నారట. అసలు విషయం మరి కొద్ది రోజులు గడిస్తే కానీ..ఎవరెరు పార్టీ నుంచి వెళ్లిపోతారు..ఎవరు ఉంటారో స్పష్టం అవుతుంది. వ్యాపారాలతో, కాంట్రాక్ట్‌లతో వందల కోట్లు ఆస్తులు ఉన్న 'విపిఆర్‌'కు అదృష్టం కలసివస్తుందా..? దురదృష్టం వరించబోతుందా..? వేచి చూడాల్సిందే.

(1297)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ