WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోడెల' కన్నా గొప్పనేతగా 'శివరామ్‌' ఎదగాలి:చంద్రబాబు

అపార రాజకీయ అనుభవంతో పాటు..నిజాయితీ,సమర్థత, సమయస్ఫూర్తితో అనేక మంది నాయకులకన్నా..ముందుకు దూసుకెళ్లిన శాసనసభాపతి 'కోడెల శివప్రసాద్‌రావు' బాటలో ఆయన కుమారుడు డాక్టర్‌ శివరామ్‌ నడిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలించబోతున్నాయి. ఒకటీ రెండు మైనస్‌లు తప్ప మిగతా విషయాల్లో డాక్టర్‌ శివరామ్‌ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఆ విషయాలు ఏమిటంటే...ఫోన్‌లో ఎవరికీ అందుబాటులో ఉండరని, కలిసేందుకు వచ్చిన వారిని గంటల పాటు నిరీక్షింపచేస్తున్నారనేది నియోజకవర్గ నాయకుల అభిప్రాయం. అటువంటిదేమీ లేదు..వ్యాపార సంబంధమైన సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు నాయకులతో మాట్లాడేందుకు కుదరదు. అదే సమయంలో ఎవరైనా ఫోన్‌ చేసినా మాట్లాడేందుకు కుదరడం లేదని 'శివరామ్‌' చెబుతున్నారు. దీనిపై స్థానిక పార్టీ నాయకులు స్పందిస్తూ..అప్పటికప్పుడు మాట్లాడకపోయినా.. ఫోన్‌లో స్పందించకపోయినా..సమావేశాలు ముగిసిన తరువాత మాట్లాడే సమయం ఉంటుంది...ఫోన్లు చేసిన వారికి మళ్లీ సమాధానం చెప్పే సమయం ఉంటుంది. ఈ రెండు విషయాల్లోనే డాక్టర్‌ శివరామ్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారని లేకుంటే తండ్రిని మించిన తనయుడిగా పేరు వచ్చేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

  నిన్న కాక మొన్న కోటప్పకొండ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించినసందర్భంగా కోడెల శివరామ్‌ చేసిన ఏర్పాట్లకు ఆయన సంతృప్తి చెంది భుజం తడుతూ 'మీ నాన్నను మరిపించాలి...ఆయన వ్యవహారశైలి కన్నా..నీ వ్యవహారశైలి స్పీడుగా ఉండాలని' అన్నారట. ఏ విషయాలు 'చంద్రబాబు' దృష్టికి వచ్చాయో..తెలియదు కానీ..పరోక్షంగా 'శివరామ్‌'ను ప్రోత్సహించేందుకే ఆయన ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయాలని 'శివరామ్‌' భావిస్తున్న నేపథ్యంలో 'చంద్రబాబు' ఆశీస్సులు, సూచనలు ఆయనకు కలసిరాబోతున్నాయి. తండ్రిని మించిన తనయుడు కావాలంటే..కోడెల శివప్రసాదరావుకు ఉన్న ఓర్పు,నేర్పును ఆయన నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో వెయ్యికోట్లు ఖర్చుతో అనేక అభివృద్ధి పనులను 'కోడెల' చేపట్టిన నేపథ్యంలో...ఆయా అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడానికి 'కోడెల శివరామ్‌' కూడా కష్టపడ్డారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అర్హులైనవారందరికీ ఫించన్లు ఇప్పించారని, పార్టీనాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు ఆర్థికంగా ఎదిగేందుకు 'శివరామ్‌' కల్పించారనే పేరుంది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో 'శివరామ్‌' చేపట్టిన అవయవదాన కార్యక్రమం హిట్‌ అయింది. సుమారు లక్ష మంది తమ అవయవాలు దానం చేసేందుకు సంతకాలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో 'కోడెల' పాత్రను ప్రతిపక్షనేత అంబటి రాంబాబు వ్యంగ్యంగా విమర్శలు చేసినప్పటికీ..మొదటల్లో మౌనం వహించిన ఆయన తరువాత..తనదైన శైలిలో ఎదురుదాడి చేయడమే కాకుండా..వాస్తవాలను వివరించారు.. అంబటి వ్యవహారశైలిని ఎండగట్టి ఆయనను దెబ్బకొట్టగలిగారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో 'కోడెల' రాజకీయ వారసుడిగా..తనదైన ముద్రతో అందరితో కలసిమెలసి ఉంటూ.. ఎమ్మెల్యేగా పోటీ చేసి..శాసనసభలో ప్రవేశించాలని కోరుకుంటున్నారు 'శివరామ్‌'. తమ నాయకుడు చేసిన 95శాతం మంచి పనులకన్నా..ఒకటి రెండు తప్పిదాలను దుష్రృచారం చేయడంలో కొంత మంది పార్టీ నాయకులు ముందున్నారని..ఇది తగదని వారు అంటున్నారు. 

  అంబటి వంటి నేత 'శివరామ్‌'కు సాటిరారని, తండ్రి నేర్పించిన బాటలో రాజకీయాల్లో ముందుకు దూసుకుపోతున్నారని ఒక్కసారే 'కోడెల' వలే పేరు తెచ్చుకోవడం సాధ్యపడదని,  కోడెల ఆ స్థాయికి ఎదగడానికి రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు..కష్టాలు పడ్డారు..స్వపక్షీయులు వెన్నుపోటు పొడిచినా..ఆఖరునిమిషంలో కాలం కలసి వచ్చి రాజకీయంగా నిలదొక్కుకోగలిగారు. తమ నాయకుడు శివరామ్‌ కూడా కొంత సమయం ఇస్తే..ఆయన వలే దూసుకువెళ్లగలిగే తెలివితేటలు ఉన్నాయి..అంబటి రాంబాబు వలే అన్ని విషయాల్లో తలదూర్చితే..ఆయనకు మా నేత 'శివరామ్‌'కు ఉన్న తేడా ఏమిటి..? ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో 'శివరామ్‌'ను ప్రత్యేకంగా ప్రోత్సహించారని, దీంతో 'ఆయన' స్థాయి పెరగడం ఖాయమని పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..తండ్రీ కొడుకుల్లో ఎవరెరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై స్పష్టత లేదని..ఈ విషయంపై తమకు కూడా తెలియదని వారి సన్నిహితులు చెబుతున్నారు. తమ నేతలో ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని, ఆయన వ్యాపార లావాదేవీలపై తక్కువ దృష్టిసారిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ఎక్కువ దృష్టిపెడుతున్నారని, ఆయనపై ఉన్న విమర్శలపైనే మీడియా దృష్టి పెడుతుందని, ఆయనలోని సానుకూలతను కూడా బయట పెట్టాలని ఆయన అనుచరులు చెబుతున్నారు.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ