WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' బట్టలూడదీస్తామంటే...తప్పులేదా...? మిస్టర్‌ ఫ్రైమ్‌మినిస్టర్‌...అంటే తప్పా...!?

వెనకటికో ముతక సామెత ఉంది..ఇష్టమైన వాళ్లు...ఇంట్లో చేసినా...తప్పులేదట...అదే ఇష్టం లేనివాళ్లు..ఎక్కడ చేసినా తప్పేనట...అచ్చం అదే విధంగా బిజెపి రాష్ట్ర నాయకుల వ్యవహారం. నిన్న విజయవాడలో జరిగిన బిజెపి నాయకుల సమావేశంలో టిడిపి నేతలు తమ పార్టీపై చేస్తోన్నవిమర్శలపై ఆగ్రహం,ఆవేశంతో స్పందించారు. ప్రధాని మోడీని చులకనగా మాట్లాడారని... టిడిపి నేతల అంతు చూడాలని కొందరు ఆవేశపడిపోయారు. శాసనసభలో ఆ పార్టీ పక్షనేత... 'విష్ణుకుమార్‌రాజు' విలేరులతో మాట్లాడుతూ..టిడిపి నేత ఒకరు ప్రధాని మోడీనీ...'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని అన్నాడని తెగ గుంజుకున్నారు. అసలు తెలియక అడుగుతా...మిస్టర్‌ప్రైమ్‌ మినిస్టర్‌ అంటే తప్పేమిటో..ఎవరికీ తెలియడం లేదు. అదేమీ అగౌరమైన పదమేమీకాదు. పైగా అత్యున్నత గౌరవ వాచకంగా ప్రపంచంతా ఆ పదాన్ని వాడుతున్నారు. మరి 'విష్ణుకుమారరాజు'కు అందులో తప్పేమి కనిపించో....? టిడిపి నేతలు ప్రధానిని అగౌరవ పర్చకపోయినా...అగౌరవ పర్చారని..ఒకటే నసుగుతున్న బిజెపి నేతలు..ప్రధానిపై వైకాపా నేతలు అసభ్య పదజాలాన్ని వాడితే...ఎందుకు మౌనంగా ఉంటున్నారు.

  వైకాపాకు చెందిన సీనియర్‌ నేత 'భూమన కరుణాకర్‌రెడ్డి' గతంలో ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేకహోదా...ప్రకటించకపోతే..గుడ్డలూడదీసి కొడతామని వ్యాఖ్యానించారు. అప్పట్లో..కానీ.. తరువాత..కానీ..ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎవరూ స్పందించలేదు. గుడ్డలూడదీసి కొడతామనడం వారి దృష్టిలో సభ్యతేమో...? అందుకే స్పందించలేదేమో...? తమతో వైకాపా నేతలు లాలూచీ పడ్డారు కనుక..వారు ఎంతటి అసభ్య మాటలు మాట్లాడినా...బిజెపి నేతల దృష్టిలో అవి తప్పు కాదు...? గౌరవ సూచికంగా మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అంటే...తప్పట..? ఏమైనా....బిజెపి నేతలు ఉండాల్సిన వారే...? ఒకవైపు రాష్ట్రానికి బిజెపి పెద్దలు ఏమీ చేయలేదని..రాష్ట్ర ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే...టిడిపి ప్రధానిని ఏదో అన్నారని ప్రచారం చేయడం వారికే చెల్లింది. మొత్తం మీద...మొదటి వాక్యంలో చెప్పుకున్నట్లు...ఇష్టమైన వాళ్లు ఏమన్నా..పర్వాలేదు..ఇష్టంలేని..'రామా' అన్నా..బూతుగానే కనిపిస్తుంది..ఏం చేస్తాం..కలికాలం..!


(1896)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ