WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆంధ్రా...బిజెపి నాయకులు రాజీనామా చేస్తే..డిపాజిట్లు వస్తాయా...!?

ఆంధ్రప్రదేశ్‌కు తాము ఎంతో చేశామని...స్వాతంత్య్రం వచ్చిన తరువాత...ఈ రీతిలో ఎవరూ సహాయం చేయలేదని..లక్షల కోట్లు..ఆంధ్రాలో వెదజల్లామని..ఒకటే ప్రచారం చేసుకుంటూ..వాదిస్తోన్న బిజెపి నాయకులు...ఆ మాట నిజమైతే...ఇప్పటికిప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి..మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌స్థానాలు సాధించిన ఆ పార్టీ...ఇప్పుడు వాటికి రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరి మళ్లీ గెలిస్తే... వారు చెప్పింది నిజమేనని..ఆంధ్రా ప్రజలు అంగీకరిస్తారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా...అది చేశాం..ఇది చేశాం..అన్నీ చేసేశాం..ఇంత కన్నా చేసేదేమీ లేదని వాదిస్తున్న వారు.. అన్నీ చేస్తే ఇప్పటికిప్పుడు పదవులకు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరితే...ఎవరి సత్తా ఏమిటో..ఎవరేం చేశారో..ప్రజలు చెబుతారు. కదా...? దానికి బిజెపి నేతలు సిద్ధంగా ఉన్నారా..?

 ఉపఎన్నికలు వస్తే..బిజెపి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే..వారంతా అఖండ మెజార్టీతో గెలుపొందుతారు..కదా..ఇంకెదుకు ఆలస్యం..? 'విష్ణుకుమార్‌రాజు' గారూ..ఈ విధంగా చేయండి... అప్పుడు..మీరు చెప్పిందే వేదమని అందరూ అంగీకరిస్తారు. గత ఎన్నికల్లో టిడిపి మద్దతుతో.. చావుతప్పి కన్నులు లొట్టపోయినట్లు గెలిచిన..బిజెపి నాయకులు...ఇప్పుడు రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరితే..వారికి డిపాజిట్లు కూడా రావని ప్రజలు చెబుతున్నారు. విశాఖపట్నం ఎంపి 'హరిబాబు' ఏం ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి తెచ్చారో..ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చు...అదే విధంగా కాకినాడ ఎంపీ 'గంగరాజు' ఏమి చేశారో..కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో..ప్రజలకు చెప్పి..వారిని మెప్పించి..ఎన్నికల్లో గెలవవచ్చు...అదే విధంగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, టిడిపి దయతో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు కూడా ఉపఎన్నికలకు సిద్ధపడి..ప్రజల తీర్పు కోరవచ్చు కదా...? అప్పుడు తెలుస్తుంది..వీళ్లలో  ఏ ఒక్కరైనా డిపాజిట్లు తెచ్చుకోగలరేమో...? ఎక్కడ చూసినా బిజెపి ఆంధ్రా ప్రజలను నమ్మించి మోసం చేసిందని ప్రజలు స్వచ్చంధంగా చెబుతుంటే..టీవీల్లో కూర్చుకుని కారుకూతలు కూస్తున్న వారు అసలు నిజాలు తెలుసుకోవాలి. ప్రజలు ఏమి కోరుకుం టున్నారో తెలుసుకోకుండా..అధిష్టానాన్ని మెప్పించడానికి...మొండివాదన చేస్తే..ప్రజల చేతిలో చావు దెబ్బలు తినక తప్పదు. గతంలో కాంగ్రెస్‌ ఇదే విధంగా చేసే ఇక్కడ నామరూపాలు లేకుండా పోయింది...ఇప్పుడు..అదే గతి బిజెపికి పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


(944)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ