WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'ను చావుదెబ్బ కొట్టిన 'పవన్‌'...!

ఇటీవల 'జగన్‌' తాను చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నానని, తాను వేస్తోన్న రాజకీయ ఎత్తుగడలు...ప్రత్యర్థులను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయనే భ్రమతో ఉన్నట్లు ఉన్నారు. అందుకే...ఆయన మితిమీరిన విశ్వాసంతో...ఎంపీల రాజీనామాలు...అవిశ్వాసం తీర్మానం అంటూ చెలరేగిపోయారు. ఏప్రిల్‌5 లోపల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించకపోతే...తన పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేస్తానని ప్రకటించాడు. ఇది చాలా తెలివైన నిర్ణయమని...ఈ నిర్ణయంతో...అధికార టిడిపి ఇబ్బందులు పడుతుందని భావించారు. అయితే...ఏప్రిల్‌6 దాకా ఎందుకు..మార్చి5నే తమ మంత్రులు రాజీనామాలు చేస్తారని టిడిపి ప్రకటించి...'జగన్‌' ఎత్తుకు చెక్‌ పెట్టింది. దీంతో...నిన్న రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతుందని..తమకు టిడిపి మద్దతు ఇవ్వాలని..ఒకవేళ వారు తమకు మద్దతు ఇవ్వకపోతే...టిడిపి అవిశ్వాసం పెడితే..తాను మద్దతు ఇస్తానని సగర్వంగా ప్రకటించారు.

   తనకు ఐదు మంది మాత్రమే ఎంపీల బలం ఉందని...మిగతా వారిని టిడిపి కూడగట్టి..అవిశ్వాసం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసలు ఆయన పెడతానన్న అవిశ్వాసానికి టిడిపి మద్దతు ఇచ్చి...మిగతా వారిని కూడా ఆ పార్టీనే కూడగట్టడం ఎందుకో..ఈ మాత్రం దానికి...టిడిపినే అవిశ్వాసం పెడుతుంది కదా...? సరే...అవిశ్వాసానికి రెడీ అని 'జగన్‌' ప్రకటించడంతో...టిడిపి దీనిపై సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే..ఇక్కడే...అనూహ్యమైన పరిణామం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా..'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' రంగంలోకి దిగి..'జగన్‌' పార్టీ అవిశ్వాసం పెడితే...తాను అవిశ్వాసానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగడతానని..ముందు 'జగన్‌' తన ఎంపీలతో అవిశ్వాసం పెట్టించాలని డిమాండ్‌ చేసి...'జగన్‌'ను చావుదెబ్బ కొట్టారు. ఒక్క ఎంపీ ఉన్నా అవిశ్వాస నోటీసు ఇవ్వవచ్చు...తరువాత మిగతా 50 మంది ఎంపీలను కూడగట్టి సంతకాలు చేయించవచ్చునని..'పవన్‌' సూచించారు. టిడిపి, తృణమూల్‌కాంగ్రెస్‌, అన్నాడిఎంకె, తదితర పార్టీలతో తాను మాట్లాడి..వారి మద్దతు కూడగడతానని..'పవన్‌' చెప్పడంతో..ఇప్పుడు 'జగన్‌' నోటిలో పచ్చివెలక్కాయపడినట్లైంది.

   రాష్ట్రానికి అన్యాయం జరిగిందని...పార్లమెంట్‌లో టిడిపి ఎంపీలు హోరాహోరిగా పోరాడుతుంటే... 'జగన్‌' పార్టీ ఎంపీలు ఐదు నిమిషాల పాటు ప్లకార్డులు పట్టుకుని తామూ నిరసనలో పాల్గొన్నామనిపించారు. 'మోడీ' సభలోకి వస్తున్నారంటే సభ నుంచి బయటకు పోయిన..వైకాపా నాయకులు..ఇప్పుడు..'మోడీ'కి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టగలరా...? ఆ ధైర్యం వారికి ఉందా...? అవిశ్వాసం పెడితే..'మోడీ' చూస్తూ 'ఊరుకుంటారా..? మొన్ననే కదా...బడ్జెట్‌ బాగాలేదని అన్నాడని స్వంత బాబాయి సుబ్బారెడ్డికి 'జగన్‌' క్లాస్‌ పీకింది...ఇప్పుడు..'మోడీ'కి వ్యతిరేకంగా...'అవిశ్వాసం' పెట్టాలంటే..ప్యాంట్‌ తడుస్తున్న అనుభూతి..మరి ఇటువంటి పరిస్థితుల్లో 'జగన్‌' బ్యాచ్‌ ఏమి చేస్తుందో...!? ఇన్నాళ్లూ 'జగన్‌' ఆడుతున్న నాటకానికి 'పవన్‌' ఆఖరి పంచ్‌ ఇచ్చినట్లే కనిపిస్తోంది. మాట తప్పం...మడమ తిప్పమంటారు కదా...మీరు అవిశ్వాసం పెట్టండి...50 మంది కాదు..80మంది మద్దతు ఇప్పిస్తాను..మార్చి4న నేనే స్వయంగా...ఢిల్లీకి వచ్చి..వారితో...మాట్లాడి కావాల్సిన మద్దతు ఇప్పిస్తానన్న మాటలు ఇప్పుడు 'జగన్‌'కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒక వైపు అవిశ్వాసం పెట్టలేడు..మరోవైపు...తాను చెబుతున్న మాటలకు..వాస్తవాలకు పొంతన లేదనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయం...మొత్తం మీద 'పవన్‌' ఉన్నట్లు ఉండి...'జగన్‌'ను చావుదెబ్బ కొట్టారని..రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి..'పవన్‌' పంచ్‌ను ఏ విధంగా 'జగన్‌' తిప్పికొడతారో..వేచి చూడాల్సి ఉంది.


(526)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ