లేటెస్ట్

‘చంద్రబాబు’కు ఊరట..!

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఊరట లభించింది. తనపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన తరుపు న్యాయవాదులు ఈ రోజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. 18వ తేదీ వరకూ ఆయనను సీఐడీ కస్టడీకి తీసుకోవద్దంటూ ఆదేశించింది. చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ వేసిన పిటీషన్‌పై సీఐడీ సమయం కోరింది. దీనికి హైకోర్టు అంగీకరించింది. అయితే రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను కూడా 19వ తేదీకి వాయిదా వేసింది. సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు టిడిపి నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ఉపశమనాన్ని ఇచ్చాయి. 


తమ నేతపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఎటువంటి నేరం చేయకపోయినా ప్రభుత్వం ఆయనను వేధిస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. డెబ్బయిదేళ్ల వయస్సు కలిగిన చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేని కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందనే భావన ప్రజల్లో వ్యాపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదని మేధావులు, ఇతరులు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలను నాశనం చేస్తే రాబోయే తరాలు దాని ఫలితాలను అనుభవిస్తాయనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ