WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒకే యాడ్‌ ఏజెన్సీకు రూ.33కోట్ల ప్రకటనలా...!?

విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం విడుదల చేస్తోన్న ప్రకటనలను ఒకే యాడ్స్‌ ఏజెన్సీకి కట్టబెట్టడంపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఒక సంస్థకే ఇన్ని కోట్ల రూపాయల ప్రకటనలు విడుదల చేయటం, ఆ యాడ్‌ ఏజెన్సీ..తమకు ఇష్టమైన పత్రికలకు యాడ్‌లు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేస్తోన్న ఈ సదస్సు గురించి ఇప్పటికే పలు పత్రికల్లో పుల్‌పేజీ యాడ్స్‌ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దానిపై ప్రకటనలు విడుదల చేయబోతున్నారు. అయితే...ఈ ప్రకటనలన్నీ ఒకే సంస్థకు కట్టబెట్టడంపై ఇతర యాడ్‌ఏజెన్సీ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులు తమ ఇష్టారీతిన ప్రకటనలను విడుదల చేశారని..దీనిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. 

  ముందు ప్రకటనలను విడుదల చేయడానికి అన్ని యాడ్‌ ఏజెన్సీల నుంచి టెండర్లును పరిశ్రమలశాఖ అధికారులు ఆహ్వానించారు. టెండర్లలో ఎల్‌1గా నిలిచిన యాడ్‌ ఏజెన్సీకీ..తరువాత ఎల్‌2,ఎల్‌3,ఎల్‌4 సంస్థలకు యాడ్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే..హఠాత్తుగా...టెండర్లల్లో ఎల్‌4గా వచ్చిన సంస్థకు మొత్తం రూ.33కోట్ల రూపాయల విలువైన ప్రకటనలను అప్పచెప్పారు. ఈ వ్యవహారంపై యాడ్‌ ఏజెన్సీలు భగ్గుమంటున్నాయి. తాము టెండర్లలో పాల్గొని ఎల్‌1గా నిలిచినా..తమకు కాదని ఎల్‌4 వచ్చిన సంస్థకు యాడ్స్‌ మొత్తం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో పరిశ్రమశాఖ ఉన్నతాధికారులు, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, సిఎంఒ కార్యాలయ అధికారి ఒకరు చక్రం తిప్పారని..వారు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ప్రయోజనాలు ఆశించి..వారు..ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారో తెలియదు కానీ..ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా..కోట్ల రూపాయల ప్రకటనలు ఒకే సంస్థకు కట్టబెట్టడంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

(460)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ