WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విజయసాయిరెడ్డి' ఆరోపణలపై మంత్రులెందుకు స్పందించరు...!?

రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తోన్న కొందరు ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై ప్రతిపక్షపార్టీకి చెందిన రాజ్యసభసభ్యుడు 'విజయసాయిరెడ్డి' ఆరోపణలు చేస్తుంటే...ప్రభుత్వంలోని మంత్రులు కానీ...ఎమ్మెల్యేలు కానీ స్పందించకపోవడంపై అధికార వర్గాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి సతీష్‌చంద్ర, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావులను 'జైలు'కు పంపుతామని 'విజయిసారెడ్డి' బహిరంగంగా బెదిరిస్తుంటే... రాష్ట్ర మంత్రులు స్పందించకపోవడం విచిత్రంగా ఉంది. నిత్యం...సిఎంఒ కార్యాలయం వద్దకు వచ్చి..ఎన్నో పనులు చేయించుకునే వీరు..ఆ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే నోరెత్తకపోవడం  అధికారులను బాధిస్తోంది. తన వద్దకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను గౌరవంగా..దగ్గర కూర్చోబెట్టుకుని వారి పనులను ఆగమేఘాలపై చేసి..వారిని సంతృప్తి పరిచే...అధికారిగా 'సతీష్‌చంద్ర'కు పేరుంది. అటువంటి ఆయనపై అన్యాయమైన, దుర్మార్గమైన ఆరోపణలు చేస్తుంటే...స్పందించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం శోచనీయం. 

   'సతీష్‌చంద్ర'కు నిజాయితీపరుడైన, సమర్థుడైన నేతగా పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయనపై ఎటువంటి ఆరోపణలు రాలేదు. రంగారెడ్డి కలెక్టర్‌గా ఆయన దాదాపు రూ.600కోట్లు విలువ చేసే భూములను కాపాడి శభాష్‌ అనిపించుకున్నారు. అదే విధంగా డిఎస్సీ ఉద్యోగాల భర్తీలోనూ అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామావుతో అభినందనలు అందుకున్నారు. అటువంటి..అధికారిపై నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఆరోపణలు చేస్తుంటే..ఖండించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 'సతీష్‌' నిజాయితీ,సమర్థతపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు..ఆయన సమర్థవంతంగా పనిచేయటం ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీ ఆయనపై నిందలు మోపుతుంటే..ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన వారు నోరు మెదకపోవడం విచిత్రమైన ఓ అధికారి వ్యాఖ్యానించారు. అదే విధంగా ఐఎఎస్‌ సంఘం కూడా ఈ వ్యవహారంలో స్పందించకపోవడం మరీ విచిత్రం. గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్‌బాబుపై 'జగన్‌' ఆగ్రహం వ్యక్తం చేస్తే..వెంటనే ఖండించిన ఐఎఎస్‌ల సంఘం ఇప్పుడెందుకో సరిగా స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తం  అవుతుంది. ఏది ఏమైనా నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారికి మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(227)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ