WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఉద్యోగుల కోర్టు తీర్పే...రాష్ట్ర ఉద్యోగులకూ అమలు అయితే...!?

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తోన్న అధికారులు,ఉద్యోగులకు రిజర్వేషన్లవిధానం చెల్లుబాటు కాదని,సాధారణ సీనియార్టీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు సోమవారం నాడు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో అనేకమంది డిప్యూటీ ఇఒలు, అసిస్టెండ్‌ ఇఒలు, సూపరింటెండ్‌లు..సీనియర్‌ అసిస్టెంట్‌లకు రివర్సన్‌ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు వారాలు లోపు తీర్పును అమలు చేయాలని టిటిడిని కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందే..ఒక కేసు విషయంలో సాధారణ సీనియార్టీ నుండి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఇఒ వరకు జాబితాను టిటిడి అధికారులు రూపొందించారు. తీర్పు కాపీ అందగానే..ఆరు వారాలు కాకుండా మూడువారాల్లోనే అమలు చేసే అవకాశం ఉంది. గతంలో కొన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇదే తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయా తీర్పులను ఏయే రాష్ట్రం అమలు చేసిందో తెలియదు కానీ...టిటిడి ఆరు వారాల లోపు అమలు చేయాలనే ఆదేశాలు ఉన్నారు. ఒకవేళ కోర్టు తీర్పును అమలు చేయకుంటే..కోర్టు ధిక్కారణ కిందకు తేవాలని భావిస్తున్నారు. అంత వరకు టిటిడి ఇఒ వెళ్లరని, వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. 

  అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్‌ఒఆర్‌పై కేసులు దాఖలు చేయటం జరిగింది. కొన్ని కేసుల్లో ఇప్పటికే..వాదనలు పూర్తి అయ్యాయి. టీటీడీకి ఇచ్చిన తీర్పునే తమకు కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. అదే తీర్పును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తింప చేస్తే కొన్ని వేల మందికి వచ్చిన ప్రమోషన్లు రద్దు కావడం ఖాయమని, సాధారణ సీనియార్టీ ప్రకారమే ప్రమోషన్లు కల్పించడం జరుగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్‌ఒఆర్‌పై హైకోర్టు తీర్పు సంచలనం సృష్టించగా..ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు టిటీడీ ఉద్యోగులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారని తెలిసింది. మరో వారం లోపు కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలిస్తే తప్ప..భవిష్యత్‌ కార్యాచరణపై ఎలా ముందుకు వెళ్లాలో అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆర్‌ఒఆర్‌ విధానం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు వేరే రాష్ట్రం విషయంలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే తీర్పు ఇక్కడ ఇస్తుందనే అంటున్నారు. ముందు టీటీడీలో ఈ తీర్పు అమలు అయితే..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగాలు విషయంలో కూడా ఇదే విధంగా జరగడానికి అవకాశం ఉంది.


(242)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ