WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పీఎన్‌బీ కుంభకోణానికి ఆడిటర్లు బాధ్యత వహించాలి:జైట్లీ...!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణానికి ఆ బ్యాంక్‌ ఆడిటర్లు, బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత వహించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. బ్యాంక్‌లో జరిగిన అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమయ్యారని...అందుకే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆడిటర్లు మొదట్లోనే ఈ వ్యవహారాలను గుర్తిస్తే..ఇటువంటి కుంభకోణాలు జరగవని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..ఈ కుంభకోణానికి ప్రధాన కారకులైన వారి పేరును కూడా 'జైట్లీ' ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరును కానీ, ఆ బ్యాంకుకు బురిడీ కొట్టి విదేశాలకు చెక్కేసిన ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ పేరును కానీ జైట్లీ ప్రస్తావించకుండా అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారంటూ నిందించారు.


(94)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ