WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'టిడిపి'లోకి 'మానుగుంట'....!

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఆయన కందుకూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీమంత్రి 'మానుకోట మహేందర్‌రెడ్డి' వైకాపాలో చేరతారని...భారీగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 'మానుకోట' వంశానికి 'కందుకూరు' నియోజకవర్గంలో బలమైన నాయకులుగా పేరుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేయటం..దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు..ఆ పార్టీనీ భూస్థాపితం చేయటంతో... 'మహేందర్‌రెడ్డి' ఇక్కడ నుంచి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వైకాపాలో కానీ...టిడిపిలో కానీ చేరతారని ప్రచారం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న  'జగన్‌' సామాజికవర్గానికి చెందిన నాయకుల్లో ఎక్కువ మంది వైకాపాలో చేరడంతో...'మానుకోట' కూడా అదే దారిలో పయనిస్తారని..ఆ పార్టీ వర్గాలు భావించాయి. తమ అధినేత..కందుకూరులో పాదయాత్ర నిర్వహించే సమయంలో ఆయన వైకాపాలో చేరతారని వారు ప్రచారం చేశారు.

     గత ఎన్నికల్లో 'కందుకూరు' నియోజకవర్గంలో వైకాపా విజయం సాధించింది. ఆ  పార్టీకి చెందిన 'పోతుల రామారావు' టిడిపి సీనియర్‌ నేత 'దివిశివరాం'ను ఓడించి..ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అనంతర పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడి టిడిపిలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి వైకాపా అధిష్టానం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అయిన 'మహేందర్‌రెడ్డి'పై గురిపెట్టింది. అయితే...ఆయన వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు..సరి కదా..కనీసం ఆ పార్టీ నాయకులతో చర్చలు కూడా జరపలేదు. అయినా ఆశ వదలని వైకాపా ఆయన తమ పార్టీలోకి వస్తారని భారీగా ప్రచారం నిర్వహించింది. అయితే వారి ఆశలను తుంచేస్తూ..'మహేందర్‌రెడ్డి' టిడిపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన టిడిపిలోకి వస్తే...ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తామని టిడిపి వర్గాలు చెబుతున్నాయట.

'పోతుల'కు...ఎమ్మెల్సీ...'శివరాం'కు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి...!

'మహేందర్‌రెడ్డి'ని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామని..టిడిపి సీనియర్‌ నేతలు చెబుతున్నారట. వైకాపా నుంచి టిడిపిలో చేరిన 'పోతుల రామారావు'పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని...ఆయనకు సీటు ఇస్తే..గెలిచే పరిస్థితి లేదని ఇటీవల జరిగిన సర్వేలో తేలిందట. దీంతో..ఆయనను కాదని...'మహేందర్‌రెడ్డి'ని పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే దీనిపై 'పోతుల' అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా..పార్టీ సీనియర్లు ఆయనను బుజ్జగిస్తూ.... ఎమ్మెల్సీ ఇస్తామని...హామీ ఇస్తున్నారట. ఇది ఇలా ఉంటే...వరుసగా ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఓడిపోయిన టిడిపి సీసీనియర్‌ నాయకుడు 'దివిశివరాం'కు ఇక మళ్లీ టిక్కెట్‌ ఇచ్చే ప్రసక్తేలేదని...ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చి ఊరడించాలని ఆలోచిస్తున్నారట. దీంతో...'మహేందర్‌రెడ్డి' రాకకు అడ్డంకులు లేవని..ఇదంతా జరగాలంటే..మరో నాలుగు ఐదు నెలలు పడుతుందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

(2101)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ