WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐదువేలు లంచం ఇస్తే పెన్షన్‌...25వేలు ఇస్తే ఇళ్లు...!

బడుగు,బలహీనవర్గాలను, పేద వర్గాల ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ఫించన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంతో ఇస్తుంటే..టిడిపి నాయకులు..స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు..ముఖ్యంగా పట్టణ విభాగంలోని కొంత మంది కౌన్సిలర్లు, ఛైర్మన్లు.. బాహాటంగా డిమాండ్‌ చేస్తూ వసూలు చేసుకున్నారు. ఇదే విషయంపై ఆధారాలతో పార్టీకార్యాలయానికి,ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినప్పటికీ..ఎటువంటి స్పందన కనిపించలేదు. ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఫించన్లు ఇస్తే ఐదువేలు లంచం ఎందుకు ఇవ్వాలని ఎవరైనా..అడిగితే..మీకు సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి..మాకు ఐదువేలు ఇస్తే..మీకు వచ్చిన నష్టమేమిటి...? మీకు జీవితాంతం ఫించన్‌ వస్తుంది కదా..అని కొందరు ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నిజాయితీగా, అర్హులైనవారికి, బీదవర్గాలకు ఇళ్లు దక్కేవిధంగా చేయండి..అని సిఎం చెబుతుంటే..మీరు తమను లంచాలు అడిగితే ఎలా అని ఎవరైనా ఎదురు చెబితే...ముందు మీరు బయటకు వెళ్లండి...అవసరమైతే 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేసుకోండి..అని వెళ్లగొడుతున్నారు. ఒకవైపు గ్రామాల్లో అనర్హులైన వారికి జన్మభూమి కమిటీ సభ్యులు..ఫించన్లు ఇప్పిస్తూ సొమ్ములు పోగేసుకుంటుంటే..మరోవైపు పట్టణప్రాంతాల్లో కౌన్సిలర్లు అదే పనిలో ఉన్నారు. కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ కొంత మంది కౌన్సిలర్లు పై విధంగా డిమాండ్‌ చేస్తూ వసూలు చేస్తున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు దృష్టికి...ఆయన కుమారుడు, యువనేత కోడెల శివరామ్‌ దృష్టికి రావడంతో..వారు వారిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. 

      పేదవారి దగ్గర లంచాలు తీసుకోవడం తప్పుకదా..అని పార్టీనాయకులు అడిగితే..లక్షలు ఖర్చులు పెట్టి...ఛైర్మన్‌, కౌన్సిలర్లు అయ్యాం..ఇప్పుడు మళ్లీ గెలిచే పరిస్థితి..లేదు..అందుకే తీసుకుంటున్నాం.. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి కదా..అంటున్నారట. నిన్నటి వరకు ఫించన్లలో అనర్హులకు మాత్రమే ఇచ్చిన వైనం బయటపడగా..తాజాగా లంచాల వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అదే విధంగా రైతులకు ట్రాక్టర్ల కేటాయింపు వ్యవహారంలో ఇచ్చిన సబ్సీడీల్లో సగం భోంచేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తమ అనుచరులకు, ఓటర్లకు ఉచితంగా సహాయం చేసేవారని పేరుండేది. కానీ...ప్రస్తుతం తెరపైకి వచ్చిన..టిడిపి నాయకులు.. అనేక విధాలుగా కక్కుర్తిపడుతూ..పార్టీ ప్రతిష్టను మంటగలుపుతూ.. తమ పూర్వికుల ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారనే విమర్శ వస్తోంది. లేకుంటే ఫించన్లకు లంచాలు తీసుకోవడం ఏమిటి..? ఇళ్లకు రూ.25వేలు లంచాలు డిమాండ్‌ చేయటం ఏమిటి..? ఇటువంటి పరిస్థితి..కొన్ని ప్రాంతాల్లో..ఉందని..అది తమ దృష్టికి వచ్చిందని పార్టీ నాయకులు చెబుతుండగా..అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ విషయంపై దృష్టిసారించడం లేదు.

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ