WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతిపరుడితో పొత్తు ఉండదు:కామినేని

ప్రధాని నరేంద్రమోడీ నీతిమంతుడని..అటువంటి నేత..అవినీతి కేసుల్లో మగ్గిపోతున్న వారితో పొత్తు పెట్టుకుంటాడని..తాను భావించడం లేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. గత కొద్దిరోజులగా..ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, వైకాపా పొత్తు గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి పెద్దలు తనను రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలగమంటే...వెంటనే వైదొలుగుతానని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల బిజెపి విజయవాడలో నిర్వహించిన సమావేశంలో 'కామినేని శ్రీనివాస్‌' అర్థంతరంగా బయటకు రావడంతో..ఆయన బిజెపిలో ఉండరని, టిడిపిలో చేరతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ..తాను బిజెపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. బిజెపి,వైకాపా పొత్తు అయ్యే పనికాదని..అత్యంత నిజాయితీపరుడు..అత్యంత అవినీతిపరుడి మధ్య పొత్తు ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఇటీవల మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని...ఆయనేదో అన్నారని..తాను అనుకోవడం లేదని...పొత్తుల్లో ఇటువంటి సహజమని వ్యాఖ్యానించారు.


(343)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ