WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిని చీల్చడానికి 'మోడీ' కుట్ర చేస్తున్నాడా...!?

ఆంధ్రాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆంధ్రానాయకులతో పాటు, ప్రజలు డిమాండ్‌ చేస్తుండడం..ప్రధాని మోడీ అహాన్ని దెబ్బతీస్తోంది. తనను ఎవరైనా దేబిరించాల్సిందే..తప్ప...డిమాండ్‌ చేస్తే తాను ఊరుకోనని...తన సత్తా ఏమిటో..ఆంధ్రా వారికి చూపించాలని 'మోడీ' తహతహలాడుతున్నారట. దీనిలో భాగంగా అనైతిక రాజకీయాలకు తెరతీస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష వైకాపాను తన చుట్టూ తిప్పుకుంటున్న 'మోడీ' తాజాగా...టిడిపి నేతలకు గాలం వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీని చీల్చడానికి ఆయన కుయుక్తులు పన్నుతున్నారని..తనను ఎదిరించి టిడిపికి శాస్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. దీనిలో భాగంగా..టిడిపిలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలను, మంత్రులను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే మాట..ఢిల్లీ వర్గాల నుంచి వస్తోంది. అనర్హతవేటు భయంతో ఉన్న వైకాపా ఎంపి 'గీత'ను తమ వైపు తిప్పుకున్న 'మోడీ,షా ధ్వయం...అదే బాటలో కేసులు ఉన్నవారిని..వ్యాపారాలు చేసే ఎంపీలను బెదిరించాలని చూస్తోందట. అంతే కాకుండా..కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులను తన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారట.

   ఇప్పటికే కేంద్ర విమానయానశాఖ మంత్రి 'అశోక్‌గజపతిరాజు'కు వలవేశారని, ఆయన టిడిపి అధినేత 'చంద్రబాబు'తో అసంతృప్తితో ఉన్నారని ప్రచారం చేయిస్తున్నారట. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 'అశోక్‌' హాజరు కాకపోవడానికి..ఆయన అసంతృప్తిగా ఉండడమే కారణమని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే..తాను ప్రయాణ బడలికతో ఉన్నానని..అందుకే పార్టీ సమావేశానికి హాజరు కాలేకపోయానని..ఆయన చెప్పినా...బిజెపి  పెద్దలు ఇదే ప్రచారాన్ని ఉధృతంగా చేయిస్తున్నారు. ఇదే సమయంలో 'అశోక్‌గజపతిరాజు'కు గవర్నర్‌ పదవి ఇస్తామని లీకులు ఇస్తూ..గందరగోళానికి గురి చేస్తున్నారు. మార్చి 5వ తేదీ తరువాత టిడిపి మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతారని టిడిపి నేతలు చేస్తోన్న ప్రచారంపై బిజెపి పెద్దలు స్పందిస్తూ...ఆ రోజు ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయరని...వారు పదవుల్లోనే కొనసాగుతారని చెబుతున్నారట.  కాగా..ఈ ప్రచారాన్ని 'అశోక్‌' గట్టిగా తిప్పికొడుతున్నారు. కాగా మరో మంత్రి సుజనాచౌదరి కూడా చంద్రబాబు ఆదేశాలు పాటించరని ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎంపీలు కూడా అధినేతపై తిరుగుబాటు చేస్తారని చెబుతున్నారు. ప్రజలంతా బిజెపి ద్రోహం చేసిందని భావిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు 'మోడీ' మాటలు నమ్మి ఆయన వైపు వెళతారా..? అంత తెలివితక్కువ పని వారెందుకు చేస్తారని టిడిపి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద..తన అహంపై దెబ్బకొట్టిన టిడిపిపై పగ తీర్చుకోవాలని 'మోడీ' శతథా ప్రయత్నిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో..చూద్దాం...!


(1029)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ