కర్ణాటక మళ్లీ కాంగ్రెస్‌దే...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటక మళ్లీ కాంగ్రెస్‌దే...!

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ విజయబావుటా..ఎగురవేయబోతోందని తాజాగా వచ్చిన ఓ సర్వే తేల్చి చెప్పింది. అధికార కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 224 సీట్లు ఉన్న అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ 58.5శాతం ఓట్లతో 120 నుంచి 132 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే తెలిపింది. ప్రతిపక్ష బిజెపి 29.3శాతం ఓట్లతో 60-72 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, మరో బలమైన పార్టీ అయిన జెడిఎస్‌ 11.7శాతం ఓట్లతో 20-32 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో స్పష్టమైంది. ఇతరులు 1-6 సీట్లు గెలుచుకుంటాయని సర్వే చెప్పింది. ఐదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధికినోచుకోలేదని..ప్రతిపక్ష బిజెపి చేస్తోన్న ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా వీస్తోన్న 'మోడీ' వ్యతిరేక గాలి ఇక్కడ కూడా ఉందని..అందుకే ఈ రకంగా సర్వే ఫలితాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

  కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి నేతలు విమర్శించడాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌ కన్నా బిజెపినే ఎక్కువ అవినీతికి పాల్పడుతుందని..తాజాగా జరుగుతున్న బ్యాంక్‌ కుంభకోణాలు తేటతెల్లం చేస్తున్నాయి. నోట్లరద్దు, జిఎస్‌టి, నిరుద్యోగం,మతరాజకీయాలు చేస్తోన్న బిజెపి కంటే..కాంగ్రెసే నయమనే అభిప్రాయం ఎక్కువ మంది ప్రజల్లో వ్యక్తం అవుతుంది. 'మోడీ' ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్న అభిప్రాయం..మోడీ మోసగాడని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ కన్నా ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతే 'బిజెపి' కొంప ముంచబోతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవినీతిపరుడన్న 'మోడీ' వ్యాఖ్యలను ప్రజలు ప్రస్తావిస్తూ..బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అంతకంటే పెద్ద అవినీతి పరుడని..ఏ రాయి అయితేనే..పళ్లు రాలగొట్టించుకోవడానికి..అన్నట్లు పాతరాయి అయితేనే బెటర్‌ అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని సర్వే తేల్చి చెబుతోంది. మొత్తం మీద దక్షిణాదిలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న రాష్ట్రంలో బిజెపికి ఎదురు దెబ్బ తప్పేటట్లు లేదు.

(424)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ